Railway Jobs: సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...మొత్తం 2,562 ఖాళీలు

సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సరైన అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. పోస్టులు, ఇతర సమాచారానికి సంబంధించిన  పూర్తి వివరాలు

central railway releases notification for apprentice posts

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 23 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ జనవరి 22. మొత్తం ఖాళీల సంఖ్య  2562.


అప్రెంటిస్ పోస్టుల వివరాలు.

క్లస్టర్ల వారీగా  ఖాళీల విభజన.

ముంబయి క్లస్టర్ లో 1,767 ఖాళీలు.

క్యారేజీ & వ్యాగన్ (కోచింగ్) వాడీ బండర్ 258,
కల్యాణ్ డీజిల్ షెడ్ 53,
కుర్లా డీజిల్ షెడ్ 60,
SR.DEE (TRS) కల్యాణ్ 179,
Sr.DEE (TRS) కుర్లా 192,
పారెల్ వర్క్‌షాప్ 418,
మతుంగా వర్క్‌షాప్ 547,
ఎస్ & టీ వర్క్‌షాప్, బైకుల్లా 60,
 

also read డిగ్రీ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగావకాశం...

భుసవాల్ క్లస్టర్ లో 421 ఖాళీలు

క్యారేజ్&వ్యాగన్ డిపో 122,
ఎలక్ట్రికల్ లోకో షెడ్ 80,
ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్క్‌షాప్ 118,
మన్మడ్ వర్క్‌షాప్ 51,
TMW నాసిక్ రోడ్ 50,

 పుణే క్లస్టర్ లో 152 ఖాళీలు

క్యారేజ్ & వ్యాగన్ డిపో 31,
డీజిల్ లోకో షెడ్ 121,
మొత్తం పోస్టులు 152,


నాగ్‌పూర్ క్లస్టర్ లో 128 ఖాళీలు

ఎలక్ట్రికల్ లోకో షెడ్, అజ్మీ 48,
క్యారేజ్ & వ్యాగన్ డిపో 80,
మొత్తం పోస్టులు 128,

also read సికింద్రాబాద్ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌‌లో టీచింగ్ పోస్టులు...

సోలాపూర్ క్లస్టర్  94 ఖాళీలు

క్యారేజ్ & వ్యాగన్ డిపో 73,
కుర్దువాడీ వర్క్‌షాప్ 21,
మొత్తం పోస్టులు 94,

విద్యా అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

వయోపరిమితి: 01.01.2020 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య వయస్సీ వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్ క్యాటగిరీవరకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుల సమర్పణ, ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 022-67453140 ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ఈమెయిల్: act.apprentice@rrccr.com

ఎంపిక చేసే విధానం: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితాను తయారు చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రక్రియ ప్రారంభం తేదీ 23.12.2019  చివరితేది 22.01.2020

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios