ఇండియన్  నేవీలో ఖాళీ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2 జనవరి 1997 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో నేవీలో ఖాళీ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రతీ ఏటా ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐ‌ఎన్‌ఈ‌టి) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది.

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బి) మార్కుల ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఈ పోస్టులకు అవివాహిత పురుషు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లో కోర్సు జనవరి 2022లో ప్రారంభం అవుతుంది. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో కోర్సు నిర్వహణ ఉంటుంది.

మొత్తం ఖాళీ పోస్టులు - 40

విద్యార్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసై ఉండాలి

వయస్సు: 2 జనవరి 1997 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

also read డిగ్రీ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.37 వేల జీతం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ స్థలం: విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్

దరఖాస్తు ప్రారంభం: 16 జూలై 2021

దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూలై 2021

ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు: 21 సెప్టెంబర్ 2021 నుంచి జరుగుతాయి.

కోర్సు ప్రారంభం: జనవరి 2022 

అధికారిక వెబ్‌సైట్‌:https://www.joinindiannavy.gov.in/