ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్  ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.   ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు చివరి తేది 21 జులై 2021.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన జడ్జిలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 21 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hc.ap.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య : 25

పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు.

అర్హత: ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

also read 10వ తరగతి అర్హతతో తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

వయసు: అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.37,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
దరఖాస్తును రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), 
హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, 
నేలపాడు, అమరావతి,
 గుంటూరు–522237

దరఖాస్తులకు చివరి తేది: 21 జులై 2021

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌:https://hc.ap.nic.in/