UPSC Jobs: యుపిఎస్‌సి సివిల్స్ నోటిఫికేషన్ జారీ
సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ 2020 సంవత్సరానికి యుపిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 796 ఖాళీలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: యుపిఎస్‌సి సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ 2020 సంవత్సరానికి యుపిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 796 ఖాళీలు ఉన్నాయి.
యుపిఎస్‌సి నోటిఫికేషన్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఐదేళ్లు, ఇతర వెనకబడిన వర్గాల వారికి మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తించనున్నాయి.
సివిల్స్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 3 ఆఖరి తేది అని తెలిపారు. పరీక్షకు మూడు వారాలు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు.
మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ చూడొచ్చు. అలాగే ఈ సంవత్సరం(2020) సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న జమ్మూకశ్మీర్ యువతకు గరిష్ట వయోపరిమితి విషయంలో మినహాయింపులను ఇవ్వడం లేదు.
also read డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ....
గత సంవత్సరం 1980–89 మధ్య అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసులైన సివిల్స్ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి ఐదేళ్ల పాటు పెంచారు.
తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆ సడలింపును కొట్టేశారు. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ సందర్శించి అప్లై చేసుకోగలరు.