బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం....వెంటనే అప్లై చేసుకోండీ
బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ బస్తీ దవాఖానల్లో కనీస అర్హతగా ఎంబీబీఎస్ చేసి వారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యులుగా నమోదైన వారు మెడికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు అని తెలిపారు.
also read పెరుగుతున్న నిరుద్యోగం...700 ఉద్యోగాలకు 7,500 మంది దరఖాస్తు...
మెడికల్ ఆఫీసర్‌కు వేతనంగా నెలకు రూ.42వేల ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న వారు స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులని తెలిపారు.
స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21వేల జీతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్ అటెస్టేషన్‌తో కూడిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతపరిచి దరఖాస్తు ఫారాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయనికి పోస్టులో గడువు ముగింపు తేదీ లోగా పంపించాలి. పోస్టు ద్వారా గానీ వ్యక్తిగతంగగాని అందజేయాలని సూచించారు.
also read సెంట్రల్ యూనివర్శిటీలో టీచింగ్ పోస్టులు...వెంటనే అప్లై చేసుకోండీ
పంపించాల్సిన అడ్రస్
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం,
ఫిల్లర్ నంబర్ 294, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే,
మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రగనర్, రంగారెడ్డి జిల్లా
ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ www.rangareddy.telangana.gov.in లో చూడగలరు.