డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ....
ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరయిన విద్యార్ధులు తమ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే వారికి ఈ రివాల్యుయేషన్ అవకాశాన్ని కల్పించింది.
హైదరాబాద్ : డిగ్రీ ఫలితాల తరువాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరయిన విద్యార్ధులు తమ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే వారికి ఈ రివాల్యుయేషన్ అవకాశాన్ని కల్పించింది.
అయితే రివాల్యుయేషన్ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీ కోర్సులకు విద్యార్ధులు రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 22వ తేదీ వరకు దాఖలు చేయాలని సూచించారు.
also read విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!
అలాగే రూ.200 లేట్ ఫీజుతో ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. జవాబుపత్రాల జిరాక్స్ కాపీ కావాల్సిన వారు వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయాలీ అని ఆన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.