కొత్త సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బి‌ఐ) బ్యాంక్ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్‌బి‌ఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌ వివరాలను అందుబాటులో ఉంచింది.

దీని ద్వారా మొత్తం 8,134 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా 134 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి.నోటిఫికేషన్ లో తెలిపిన మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించారు.

also read UPSC: యుపి‌ఎస్‌సిలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...మొత్తం ఖాళీలు 29

వీటిలో తెలంగాణకు 375 పోస్టులు, ఏపీకి 150 పోస్టులను కేటాయించారు. జనవరి 3 అంటే శుక్రవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

పోస్టుల వివరాలు...

జూనియర్ అసోసియేట్ (క్లర్క్) రిక్రూట్‌మెంట్  మొత్తం ఖాళీల సంఖ్య: 8,134

విభాగం: కస్టమర్ సపోర్ట్, సేల్స్

పోస్టుల కేటాయింపు: రెగ్యులర్ పోస్టులు 7,870,
(ఏపీ-150, తెలంగాణ-375)
బ్యాక్‌లాగ్ పోస్టులు 134,
స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 130,
మొత్తం ఖాళీలు 8,134


అర్హత: 01.01.2020 నాటికి ఏదైనా డిగ్రీలో  ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.01.2020 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.01.1992 - 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

పరీక్ష ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

also read నాబార్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల... మొత్తం 154 ఖాళీలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా.

జీతం: రూ.11,765-655/ 3-13730-815/ 3-16175-980/ 4-20095-1145/7-28110-2120/ 1-30230-1310/1-31450. ప్రారంభంలో బేసిక్ పేగా రూ.13,075 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం    03.01.2020 చివరి తేది    26.01.2020

ప్రిలిమినరీ పరీక్ష తేది  ఫిబ్రవరి/ మార్చి  2020.

మెయిన్ పరీక్ష తేది 19.04.2020.