UPSC: యుపిఎస్‌సిలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...మొత్తం ఖాళీలు 29
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి)లో వివిధ విభాగాల్లో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి)లో వివిధ విభాగాల్లో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత పొందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఉన్న మొత్తం ఖాళీలు 29.
వివిధ పోస్టులు వివరాలు.
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉన్న ఖలీలు 02,
డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్) విభాగంలో ఉన్న ఖాళీలు 27,
also read Jio jobs: రిలయన్స్ జియోలో ఉద్యోగాలు... డిగ్రీ, పీజీ అర్హత ఉంటే చాలు
1. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 02
విభాగం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్), హోం మంత్రిత్వశాఖ.
అర్హత: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్) (లేదా) బీఈ/ బీటెక్ (కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ) అర్హత కలిగి ఉండాలి.
2. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు 27
విభాగం: ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం మంత్రిత్వశాఖ.
అర్హత: డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) అర్హత పొంది ఉండాలి. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఐటీ స్పెషలైజేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్డులు 30 సంవత్సరాలలోపు ఉండాలి. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్డులు 35 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ.
also read నాబార్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల... మొత్తం 154 ఖాళీలు
ఎంపికల విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలీ. ఎస్బీఐలో క్యాష్ రూపంలో లేదా ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 16.01.2020.
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది 17.01.2020.