NFC Jobs: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సి) నోటిఫికేషన్ విడుదల
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించాలీ. జనవరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దీనికి ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిలు ఉంటాయి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించాలీ. జనవరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
also read Bank Jobs:ఆర్‌బిఐ 2019 నోటిఫికేషన్ విడుదల....మొత్తం 926 పోస్టులు
నోటిఫికేషన్ వివరాలు
స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-I,II), ఇతర పోస్టులలో మొత్తంగా ఉన్న ఖాళీల సంఖ్య 273.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (కోటా, రాజస్థాన్): 255
జిర్కోనియం కాంప్లెక్స్ (ట్యూటికోరన్, తమిళనాడు): 12
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (కల్పక్కం, తమిళనాడు): 06
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-I) ఖాళీల సంఖ్య: 39
విభాగాల వారీగా ఉన్న ఖాళీలు : మెకానికల్ 16, కెమికల్ 02, ఎలక్ట్రికల్ 07, ఎలక్ట్రానిక్స్ 02, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ 01, కంప్యూటర్ సైన్స్ 01, సివిల్ 06, ఆర్కిటెక్చర్ 01, ఆటోమోబైల్ 01, కెమికల్ 01, హార్టికల్చర్ 01.
ఉండాల్సిన అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. కెమికల్, హార్టికల్చర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ పొంది ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్డులు 18-24 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-II) ఉన్న ఖాళీల సంఖ్య: 184
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 95, టర్నర్ 12, వెల్డర్ 03, మెషినిస్ట్ 05, ఎలక్ట్రికల్ 20, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ 05, ఏసీ & రిఫ్రిజిరేషన్ 01, డీజిల్ మెకానిక్ 01, ప్లంబర్ 02, కార్పెంటర్ 02, మాసన్రీ 01, ల్యాబ్ టెక్నీషియన్ 03, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 34.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: సుమారు 18-22 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - అప్పర్ డివిజన్ క్లర్క్ ఖాళీల సంఖ్య: 12
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలను టైప్ చేయగలగాలి.
వయోపరిమితి: అభ్యర్డులు18-27 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
NFC - వర్క్ అసిస్టెంట్ 'ఎ'/ హాస్పిటల్ వర్క్ అసిస్టెంట్ 'ఎ' ఖాళీల సంఖ్య: 20
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జిర్కోనియం కాంప్లెక్స్ - స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-I) ఖాళీల సంఖ్య: 06
విభాగం: కెమికల్
అర్హత: డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (కెమిస్ట్రీ).
వయోపరిమితి: 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
also read DRDO Jobs: డీఆర్‌డీఓలో 10th, ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు...మొత్తం 1817 పోస్టుల ఖాళీలు
జిర్కోనియం కాంప్లెక్స్ - స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-II) ఖాళీల సంఖ్య: 06
విభాగం: కెమికల్ ప్లాంట్ ఆపరేటర్.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఇంటర్/తత్సమాన విద్యార్హత. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ - కల్పక్కం, తమిళనాడు
స్టైపెండరీ ట్రైనీ (కేటగిరీ-II): 06
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-01, ఎలక్ట్రానిక్స్-02, ప్లంబర్-01, టర్నర్-01, ఫిట్టర్-01.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ(స్క్రీనింగ్) టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, దేహదారుఢ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు ఫీజు : పోస్టుల వారీగా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు. కొన్ని పోస్టులకు రూ.150, కొన్ని పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 21.12.2019 చివరితేది: 10.01.2020.