Bank Jobs:ఆర్‌బిఐ 2019 నోటిఫికేషన్ విడుదల....మొత్తం 926 పోస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న 926 అసిస్టెంట్ పోస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.
భారతదేశంలోని బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ)2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న 926 అసిస్టెంట్ పోస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం. నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఉన్న ఖాళీల సంఖ్య 926 ఇందులో హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీల సంఖ్య 25.
అసిస్టెంట్ పోస్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.
దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల వారీగా కేటాయించిన ఖాళీలు
అహ్మదాబాద్ 19, భోపాల్ 42, భువనేశ్వర్ 28, చండీగఢ్ 35, చెన్నై 67, గువాహటి 55, హైదరాబాద్ 25, జైపూర్ 37, జమ్మూ 13, కాన్పూర్ & లక్నో 63 కోల్‌కతా 11, ముంబయి 419, నాగ్‌పూర్ 13, న్యూఢిల్లీ 34, పాట్నా 24, తిరువనంతపురం & కొచ్చి 20.
also read DRDO Jobs: డీఆర్‌డీఓలో 10th, ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు...మొత్తం 1817 పోస్టుల ఖాళీలు
ఉండాల్సిన అర్హత: అసిస్టెంట్ పోస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసైతే చాలు.
వయోపరిమితి : అభ్యర్థుల వయసు 01.12.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.12.1991 నుండి 01.12.1999 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి అభ్యర్థులు రూ.450 (ఎగ్జామ్ ఫీజు+ఇంటిమేషన్ చార్జీ) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 (ఇంటిమేషన్ చార్జీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థ ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
ఎంపికల విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షకు 100 మార్కులు, మెయిన్ పరీక్షకు 200 మార్కుల పరీక్ష నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కులకు గానూ మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయం ఉంటుంది. మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ఈ ప్రశ్నలు ఉంటాయి.
also read IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు...
మెయిన్ పరీక్షలో 200 మార్కులకు ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 40 మార్కులు. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అగుడుతారు. వీటిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. పరీక్ష సమయం 135 నిమిషాలు. మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ఈ ప్రశ్నలు ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 23.12.2019 చివరి తేది 16.01.2020
పరీక్ష ఫీజు చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా 23.12.2019 to 16.01.2020 వరకు
ప్రిలిమినరీ పరీక్ష తేది 2020 ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఉంటుంది.
మెయిన్ పరీక్ష తేది మార్చి 2020లో ఉంటుంది.