హైదరాబాద్ లోని భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సి‌పి‌టి‌ఎం) వివిధ విభాగాల్లో ఉన్న మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సి‌పి‌టి‌ఎం) వివిధ విభాగాల్లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా డిసెంబరు 23 నుంచి ప్రారంభం కానుంది.

పదోతరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.100 చెల్లించి ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలీ. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపును కల్పించారు.23 జనవరి 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు.

మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల వివరాలు

also read IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 1817

క్యాటగిరి వారిగా పోస్టుల కేటాయింపు: జనరల్-849, ఓబీసీ-503, ఈడబ్ల్యూఎస్-188, ఎస్‌సి-163, ఎస్‌టి-11

అర్హత : మల్టీటాస్కింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ప‌దోత‌ర‌గ‌తి లేదా ఐటీఐ అర్హత పొంది ఉండాలి. 

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 23.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల మ‌ధ్య వయస్సు వారై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.100 చెల్లించాలీ. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

also read jobs: తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు...మొత్తం 450 పోస్టుల ఖాళీలు

ఎంపిక విధానం: రాత పరీక్షల ద్వారా.


దరఖాస్తు ఫీజు: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.12.2019 చివ‌రితేది: 23.01.2020. టైర్-1 పరీక్ష తేదిని ఇంకా వెల్లడించాల్సి ఉంది.

చిరునామా:
The Director,
Centre for Personnel Talent Management (CEPTAM),
Defence R&D Organization (DRDO), Ministry of Defence,
Metcalfe House, Civil Lines,
Delhi-110 054.
Helpline: 011-23882323, 23819217
E-mail: mtshelpdesk@detceptam.com