ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బెనెవోలెంట్ అసోసియేషన్-IAFBA. ఇందులో భాగంగా IAFBA 5 పోస్టులని మాత్రమే ప్రకటించింది.

ఆసక్తి గల అభ్యర్థులు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది ఈ దరఖాస్తుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ. మొత్తంగా ఉన్న ఖాళీలు 5.


ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ నోటిఫికేషన్ వివరాలు

also read బస్తీ దవాఖానల్లో మెడికల్‌ ఆఫీసర్, స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం....వెంటనే అప్లై చేసుకోండీ

జూనియర్ క్లర్క్ (EDP)- 1

జూనియర్ క్లర్క్- 2

అసిస్టెంట్ మేనేజర్ (రిసెప్షనిస్ట్)- 1

అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ అసిస్టెంట్)- 1

దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి 13

దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 17

విద్యార్హత: డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయస్సు:  జూనియర్ క్లర్క్ (EDP) పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.

also read UPSC Jobs: యుపి‌ఎస్‌సి సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీ
 

జూనియర్ క్లర్క్ పోస్టుకు 25 ఏళ్లు అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు దాటరాదు

జీతం- నెలకు రూ.30,500 వరకు ఇస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Secretary,
IAF Benevolent Association,
AFGIS Bhawan,
Subroto Park, New Delhi-110010.