BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మొత్తం 317 ఉద్యోగాల భర్తీకి బీఎస్ఎఫ్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

bsf  released recruitment  notification 2020 for various posts

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి బీఎస్ఎఫ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లో  మొత్తం 317 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ లాంటి పోస్టులు  ఖాళీగా ఊన్నాయి. గ్రూప్ బీ,  గ్రూప్ సీలో భర్తీ చేస్తునున్న పోస్టులు ఇవే.

 డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ ఖాళీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్స్ http://www.bsf.gov.in/ లేదా http://www.bsf.nic.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

also read IAF Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండీ

లేటెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ / రోజ్‌గార్ సమాచార్ పత్రికలో కూడా నోటిఫికేషన్ వివరాలు తేలుసుకోవచ్చు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బి‌ఎస్‌ఎఫ్ రిక్రూట్మెంట్ 2020 పోస్టుల ఖాళీల వివరాలు

ఎస్ఐ (మాస్టర్)- 5
ఎస్ఐ (ఇంజిన్ డ్రైవర్)- 9
ఎస్ఐ (వర్క్‌షాప్)- 3


హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)- 56హెడ్ 
కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)- 68

also read UPSC Jobs: యుపి‌ఎస్‌సి సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీ

మెకానిక్ (డీజిల్ / పెట్రోల్ ఇంజిన్)- 7
ఎలక్ట్రీషియన్- 2
ఏసీ టెక్నీషియన్- 2
ఎలక్ట్రానిక్స్- 1
మెషినిస్ట్- 1
కార్పెంటర్- 1
ప్లంబర్- 2
సీటీ (క్రూ)- 160

15  ఫిబ్రవరి 2020  నోటిఫికేషన్ విడుదల చేశారు.  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 మార్చి 2020 

విద్యార్హత- ఎస్సై పోస్టుకు 12వ తరగతి చదివి ఉండాలి, అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 10వ తరగతి, టెక్నికల్ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా చేసి అర్హత పొంది ఉండాలి.
వయస్సు- ఎస్సై పోస్టులకు 22 నుంచి 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 20 నుంచి 26 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios