Asianet News TeluguAsianet News Telugu

496 కానిస్టేబుల్ ఖాళీలను ప్రకటించిన పోలీస్ రిక్రూట్‌మెంట్

బీహార్‌లోని సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ (సిఎస్‌బిసి) మొబైల్ స్క్వాడ్ కానిస్టేబుల్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ నోటీసును విడుదల చేసింది.

bihar police releases notification for conistable posts
Author
Hyderabad, First Published Oct 30, 2019, 5:17 PM IST

న్యూఢిల్లీ:బీహార్‌లోని సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ (సిఎస్‌బిసి) మొబైల్ స్క్వాడ్ కానిస్టేబుల్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ నోటీసును విడుదల చేసింది. మొత్తం 496 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను రవాణా శాఖలో నియమించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది, దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 29, 2019 తో ముగుస్తుంది. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది, తరువాత శారీరక కొలత / సమర్థత పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీని బోర్డు తరువాత ప్రకటిస్తుంది.

also read డిగ్రీ అర్హతతో నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం..

2019 ఆగస్టు 1 నాటికి గుర్తింపు పొందిన విద్యామండలి నుండి ఇంటర్మీడియట్ లేదా 10 + 2 ఉత్తీర్ణులైన వారు సిఎస్‌బిసితో కానిస్టేబుల్ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థి రెండు లేదా ఫోర్ వీలర్ లైట్ మోటారు వెహికల్ (ఎల్‌ఎమ్‌వి) లేదా హెవీ మోటార్ వెహికల్ (హెచ్‌ఎంవి) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

bihar police releases notification for conistable posts

తక్కువ వయోపరిమితి 18 సంవత్సరాలు, ఉన్నత వయోపరిమితి సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, వెనుకబడిన తరగతులకు 27 సంవత్సరాలు, ఓబిసి కేటగిరీ పురుష అభ్యర్థులకు మరియు వెనుకబడిన తరగతులకు 28 సంవత్సరాలు, ఓబిసి కేటగిరీ మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు. బీహార్‌లో శిక్షణ పొందినహోమ్ గార్డ్‌లకు ఉన్నత వయోపరిమితిపై 5 సంవత్సరాల సడలింపు అనుమతించబడుతుంది.

also read  ఎస్బీఐలో 2000 పీఓ జాబ్స్: 22లోగా అప్లై చేయండి

ఎంపిక కోసం రెండు దశలు ఉంటాయి. మొదటి దశ  OMR- ఆధారిత ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ఉంటుంది, పరీక్ష వ్యవధి 2 గంటలు. రాత పరీక్షలో ఉతీర్ణులైనవారి ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు శారీరక కొలత / సమర్థత పరీక్షకు హాజరవుతారు. పిఇటి, పిఎమ్‌టి రౌండ్‌లో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితా తయారు చేయబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios