ఎస్బీఐలో 2000 పీఓ జాబ్స్: 22లోగా అప్లై చేయండి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్పీఐ) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల(పీఓ) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే అవకాశం కల్పించింది.

SBI PO Recruitment 2019: Registration for 2000 SBI jobs now open   on sbi.co.in

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్పీఐ) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల(పీఓ) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే అవకాశం కల్పించింది.

దరఖాస్తుకు ఏప్రిల్ 22న చివరి తేదీ. ఏప్రిల్ 2 నుంచే ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ ప్రారంభమైంది. ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ ఏప్రిల్ 22.

అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్‌సైజ్ అండ్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థుల్లో ఖాళీల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థులు(20,000) మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ప్రతిభ చూపిన  అభ్యర్థుల్లో ఖాళీల సంఖ్యకు 3 రెట్లు అభ్యర్థులు(3000) గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూకు అర్హులవుతారు.

మెయిన్స్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్‌సైజ్ అండ్ ఇంటర్వ్యూల మొత్తాల్లోని ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దానిలోని మార్కులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకవోడం జరగదు.

కాగా, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 13 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం ఉంది. పీవోగా చేరినవారు బ్యాంకులో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. అయితే, ఇతర పోటీ పరీక్షలతో పోల్చుకుంటే ఇందులో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్నల సరళి కూడా కఠినంగానే ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 2000

విద్యార్హత: ఏదైనా డిగ్రీ(డిగ్రీ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ అభ్యర్థులు 
కూడా అర్హులే)

వయో పరిమితి(1.04.2019నాటికి): 21-30ఏళ్లు

దరఖాస్తుకు చివరి తేదీ: 22.04.2019

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 8/9/15/16 2019(మే-2019 మూడో వారం నుంచి ప్రిలిమనరీ పరీక్ష కాల్‌లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)

మెయిన్స్ పరీక్ష తేదీ:  20.07.2019

దరఖాస్తు ఫీజు: రూ. 125(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ), రూ. 750(జనరల్/ఓబీసీ)

మరిన్ని వివరాల కోసం www.sbi.co.inను సంప్రదించవచ్చు.

సంబంధిత వార్త చదవండి: ఎస్బీఐ భారీ రిక్రూట్‌మెంట్: 8,653 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios