డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? ఈ సదవకాశం మీ కోసమే. డిగ్రీ పూర్తి చేసిన వారికి నేవీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారు నేరుగా.. ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.ఇందుకోసం ప్రత్యేకంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.

విద్యార్హత డిగ్రీగా నిర్ణయించింది. ఏడాదిలో రెండు సార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో ఉన్న యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(సీడీఎస్) అలాగే కొనసాగనున్నాయి. పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీసెస్ కమిషన్ ఉద్యోగాల ఎంపిక కోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుందని ప్రకటనలో తెలిపింది. 

అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూనివర్సిటీ ఎంట్రన్స్ స్కీమ్‌లకు సంబంధం లేని ఉద్యోగాల కోసం మాత్రమే ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది.