Asianet News TeluguAsianet News Telugu

BANK Jobs:ఎస్‌బి‌ఐ బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండి

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

sbi bank recruitment 2020 released for clerks and various posts apply now
Author
Hyderabad, First Published Jan 24, 2020, 10:30 AM IST

భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. క్లరికల్ కాడర్ కింద ఆర్మోరర్స్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే క్లరికల్ పోస్టులకు కేవలం ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 106 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 

పోస్టుల సంభందించి పూర్తి వివరాలు

1. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (రెగ్యులర్): 45

2. ఆర్మోరర్స్-క్లరికల్ కేడర్(ఎక్స్-సర్వీస్‌మెన్): 29

3. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (కాంట్రాక్ట్): 02

4. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (రెగ్యులర్, కాంట్రాక్ట్): 30

also read న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.


1. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (రెగ్యులర్) సంభందించి డిప్యూటీ మేనేజర్ (లా) 45 పోస్టులు ఉన్నాయి. పోస్టులను జనరల్-20, ఓబీసీ-12, ఎస్సీ-06, ఎస్టీ-03, ఈడబ్ల్యూ-04 కేటాయించారు.

అర్హత: 3/5 సంవత్సరాల లా డిగ్రీ కలిగి ఉండాలి.

అనుభవం: బార్ కౌన్సిల్ సభ్యత్వంతోపాటు నాలుగేళ్ల పాటు అనుభవం పొంది ఉండాలి. (లేదా) షెడ్యూల్డు కమర్షియల్ బ్యాంకుల్లో లా ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉండాలి.

వయోపరిమితి: 31.10.2019 నాటికి 25-35 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 8 ఏళ్ల అనుభవం కలిగి 42 సంవత్సరాలలోపు ఉండాలి.

2. ఆర్మోరర్స్-క్లరికల్ కేడర్ (ఎక్స్-సర్వీస్‌మెన్) పోస్టుల సంఖ్య: 29

పోస్టులను జనరల్-26, ఓబీసీ-02, ఎస్సీ-01 కేటాయించారు.

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

ఇతర అర్హతలు: ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజినీర్స్ నుంచి ప్రథమ శ్రేణిలో ఆర్మమెంట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆర్మరర్ (గ్రేడ్-1) అయి ఉండాలి.

వయోపరిమితి: 30.09.2019 నాటికి 20-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (కాంట్రాక్ట్) ఖాళీల సంఖ్య: 02 ఇందులో సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (డేటా అనలిస్ట్): 01, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (స్టాటిస్టిక్స్): 01

అర్హత: 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథ్స్/ఎకనామిక్స్) సాధించి ఉండాలి. ఎంబీఏ/ పీజీడీబీఎం/ బీటెక్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

అనుభవం: సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కనీసం 6 సంవత్సరాలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కనీసం 4 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.07.2019 నాటికి సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 37 సంవత్సరాలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 35 సంవత్సరాలలోపు వారై ఉండాలి.

also read హైదరదాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగాలు...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి.


4. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (రెగ్యులర్, కాంట్రాక్ట్) ఖాళీల సంఖ్య: 30

కాంట్రాక్ట్ పోస్టులు

డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (నేవీ, ఎయిర్‌ఫోర్స్): 02

సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (నేవీ, ఎయిర్‌ఫోర్స్): 02

రెగ్యులర్ పోస్టులు

హెచ్‌ఆర్ స్పెషలిస్ట్ (రిక్రూట్‌మెంట్): 01

మేనేజర్ (డేటా సైంటిస్ట్): 10

డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 10

డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్): 05

దరఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపికలు చేసే విధానం: రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 23.01.2020 చివరితేది: 12.02.2020. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 27.02.2020.

Follow Us:
Download App:
  • android
  • ios