బీటెక్‌, ఎంఫార్మసీలో కొత్త కోర్సులు...జేఎన్‌టీయూ ఆమోదం...

బీటెక్ ఎడ్యుకేషన్ లో నాలుగు కొత్త కోర్సులను జేఎన్‌టీయూహెచ్ ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సీఎస్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఐటీ అండ్ ఇంజినీరింగ్ వంటి కొత్త  కోర్సులకు జేఎన్టీయూ ఆమోదం తెలిపింది. 

jntuh approves new courses in btech and m.pharmacy

 కాలేజీలో అధ్యాపకులు సెమిస్టర్ మధ్యలో ఉద్యోగం వదిలి వెళ్లిపోకుండా చివరివరకూ పని చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని జేఎన్‌టీయూ కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. ప్రతి కాలేజీలో పాలక మండలిని ఏర్పాటు చేసుకొని, తరచూ సమావేశమై దాని నివేదికను వర్సిటీకి పంపాలనే నిబంధనలను విధించింది.


బీటెక్ ఎడ్యుకేషన్ లో నాలుగు కొత్త కోర్సులను జేఎన్‌టీయూహెచ్ ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సీఎస్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఐటీ అండ్ ఇంజినీరింగ్ వంటి కొత్త  కోర్సులకు జేఎన్టీయూ ఆమోదం తెలిపింది. అలాగే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన ముసాయిదా రూపొందించింది.

also read విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!

టీచింగ్ అధ్యాపకుల విద్యార్హతలు నకిలీవని తేలితే ఆ కళాశాలల గుర్తింపులను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి పాటించాలని  తెలిపింది.ఈ నాలుగు కొత్త  కోర్సుల చేర్చటంతో  బీటెక్‌లో కోర్సుల సంఖ్య 22కు పెరిగింది. ఎంఫార్మసీలో ప్రస్తుతమున్న నాలుగు కోర్సులను రద్దు చేసి కొద్ది మార్పులతో మరో నాలుగు కోర్సులను జతచేసింది.

ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ వంటి కొత్త కోర్సులను  ఆమోదించింది. అయితే కాలేజీలు, సీట్ల సంఖ్య, కొత్త కోర్సుల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే మరింతగా చేర్యలు చేపట్టుకోవచ్చని జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

also read 10th తర్వాత ఏంటి?: కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీతో నిర్ణయం తీసుకోండి


కళాశాలలో అధ్యాపకులు సెమిస్టర్ మధ్యలో ఉద్యోగం వదిలి వెళ్లిపోకుండా చివరివరకూ పని చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని జేఎన్‌టీయూ కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. ప్రతి కాలేజీలో పాలక మండలిని ఏర్పాటు చేసుకొని, తరచూ పాలక మండలి సమావేశమై దాని నివేదికను వర్సిటీకి పంపాలనే కొత్త నిబంధన కూడా విధించింది.

విద్యార్థులు, సిబ్బంది సమస్యలను ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ వేదిక ఏర్పాటు చేయాలని సమస్యను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కూడా ఆదేశించింది. ఒకవేళ లేని పక్షంలో యాజమాన్యం తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని  గట్టిగా హెచ్చరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios