విద్యార్థులకు గుడ్ న్యూస్... తగ్గనున్న కాలేజీ ఫీజులు!

ఈ విద్యా సంవత్సరం గతంలో కంటే తక్కువగా ఫీజులు ఉంటాయని ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

andhra pradesh government plans to reduce engineering college fees soon

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించేందుకు  విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం గతంలో కంటే తక్కువగా ఫీజులు ఉంటాయని ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. వచ్చే నెల రెండో వారంలో విద్యా సంవత్సర ఫీజులను నిర్ణయించి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన అన్నారు.

also read ఎన్‌టి‌ఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ టెస్ట్ 2019...

ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఫీజులను నిర్ణయించబడతాయి. దీనిపై ఫిబ్రవరి 4 వరకు కాలేజీల వాదనలు విని తరువాత ఆ నెల మధ్య వారంలో ఫీజులను ప్రకటిస్తాం. మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి వాటి ఫీజుల విధానంపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.

andhra pradesh government plans to reduce engineering college fees soon

యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషనే ఖరారు చేస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీలోపు అన్ని కాలేజీలు వారి ఫీజుల పట్టికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇక ఈ ఏడాది ఫీజుల నిర్ణయంలో కొంత జాప్యం కలగడం వల్ల 2020-21, 2022-23 విద్యాసంవత్సరాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది.

also read 10th తర్వాత ఏంటి?: కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీతో నిర్ణయం తీసుకోండి

డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజుల అమలవుతాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవు. అంతేకాకుండా విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు గ్రీవెన్స్‌ సెల్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నాం అని తెలిపారు.

విద్యార్థుల దగ్గర నుంచి ఏ కళాశాల యజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను తీసుకోరాదు. కేవలం జిరాక్స్ కాపీలను వాటితో సరి చూసుకుని వెంటనే తిరిగి ఇచ్చేయాలి అని తెలిపింది. ఇదిలా ఉంటే సరైన వసతులు లేని కాలేజీలకు కొంత గడువు ఇస్తాం. ఇచ్చిన గడువులోగా కాలేజీ లోపాలను సరిదిద్దుకోకపోతే తప్పనిసరిగా కాలేజీలపై చర్యలు తీసుకుంటాం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios