ప్రతిభ గల 10వ తరగతి బాలికలకు ఇంటర్మీడియట్ విద్యకై ఆర్ధిక తోడ్పాటును అందించడం కోసం ఎన్‌టి‌ఆర్  ట్రస్ట్ గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న GEST స్కాలర్ షిప్ ను ఈ నెల 15వ తేదీన గండిపేట లోని ఎన్‌టి‌ఆర్ బాలికల జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రాంగణం లో ఉదయం 10గం. నుండి  మధ్యానం12గం. వరకు జరుగుతుంది.

also read SAI Jobs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం

 ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్టాలలోని 10వ తరగతి చదువుతున్న బాలికలు ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎన్‌టి‌ఆర్  ట్రస్ట్ మేనేజింగ్  ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు కోరారు.

ఈ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు నెలకు రూ.5000/ చొప్పున, 11 నుంచి 25 ర్యాంకులు సాధించిన విద్యార్ధినీలకు నెలకు రూ.3000 చొప్పున ఎన్‌టి‌ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకొనుటకు  ఆర్దిక సహాయం అందించబడుతుందని తెలిపారు.  

also read ECIL'లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు...నెలకు 67వేల జీతం

ఆసక్తి కలిగిన విద్యార్దినీలు www.ntrtrust.orgలో డిసెంబర్  13 వ తేదీ లోపు  రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్ లని సంప్రదించగలరు 7660002627/28