Asianet News TeluguAsianet News Telugu

బార్డర్ సెక్యూరిటి ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లయ్ చేసుకోవడానికి క్లిక్క్ చేయండి

బీఎస్‌ఎఫ్‌లో గ్రూప్‌ బీ, సీ విభాగంలో ఖాళీగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు.

bsf recruitment 2021 released apply for 70 group b and c inspector and sub inspector posts
Author
Hyderabad, First Published Apr 28, 2021, 6:26 PM IST

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రైమరీ బోర్డర్ గార్డింగ్ ఆర్గనైజేషన్  బార్డర్ సెక్యూరిటి ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) ఖాళీ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌ బీ, సీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ ఏడాది చివరిలోగా  చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌, జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌, సీనియర్‌ రేడియో మెకానిక్‌ (ఇన్‌స్పెక్టర్‌), అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌ పోస్టులున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://bsf.nic.in/ అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

also read ఎస్‌బీఐలో క్లర్క్‌ పోస్ట్స్ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

మొత్తం పోస్టుల సంఖ్య: 70
సీనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌- 12, సీనియర్‌ రేడియో మెకానిక్‌- 5, జూనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌- 4, అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌- 8, అసిస్టెంట్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ రేడియో మెకానిక్‌- 3, సీనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌- 1, జూనియర్‌ ఫ్లైట్‌ గన్నర్‌- 4, సీనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌- 1, జూనియర్‌ ఫ్లైట్‌ ఇంజినీర్‌- 4, ఇన్‌స్పెక్టర్‌ లేదా స్టోర్‌మ్యాన్‌- 4, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌- 4, కానిస్టేబుల్‌- 4

విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేదీ: 31 డిసెంబర్‌ 2021

అధికారిక వెబ్‌సైట్‌: http://bsf.nic.in/
 

Follow Us:
Download App:
  • android
  • ios