Asianet News TeluguAsianet News Telugu

ఎస్‌బీఐలో క్లర్క్‌ పోస్ట్స్ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

ఎస్‌బి‌ఐ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమవుతుంది. 

sbi clerk posts notification 2021 released registration begins for 5237 junior associates on sbi co in
Author
Hyderabad, First Published Apr 27, 2021, 5:20 PM IST


ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారీగా జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 275 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 27 నుంచి అంటే నేటి నుండి  ప్రారంభమవుతాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తులకు మే 17 చివరితేది.

 స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంతో పాటు అర్థం చేసుకోవడంతప్పనిసరి వచ్చి ఉండాలి. అభ్యర్థులు మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు https://www.sbi.co.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య: 5237

విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్‌  2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య  ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

also read యువకులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ ...

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్‌సి, ఎస్‌టి, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

అలాగే  నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. 1 గంట సమయంలో జరిగే ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. 1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (30 మార్కలు) 2. న్యూమరికల్‌ ఎబిలిటీ (35 మార్కులు) 3. రీజనింగ్‌ ఎబిలిటీ (35 మార్కులు). ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు.

 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27 ఏప్రిల్‌ 2021

దరఖాస్తుకు చివరితేది: 17 మే 2021

ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌, 2021

మెయిన్స్‌ పరీక్ష: 31 జులై 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://www.sbi.co.in/

Follow Us:
Download App:
  • android
  • ios