Asianet News TeluguAsianet News Telugu

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రేపు ఉద్యోగ మేళా.. వెంటనే అప్లయి చేసుకోండీ..

నిరుద్యోగుల కోసం గొప్ప అవకాశం. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న నిరుద్యోగుల కోసం రేపు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. 

apssdc job recruitment drive at anantapur district andhra pradesh check here for more details
Author
Hyderabad, First Published Jul 29, 2021, 4:48 PM IST

తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా నివహించనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేసన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రముఖ సంస్థల్లో ఉన్న  ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జులై 30న అనంతపూర్ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

అయితే అభ్యర్థులు ముందుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్ సైట్‌ https://apssdc.in/లో ఉద్యోగ మేళా కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010039901 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.

1. Needs Services Pvt Ltd (Amazon): ఈ సంస్థలో 65 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్, బార్ కోడ్ స్కానింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.13,140 వరకు వేతనం ఉంటుంది.

also read ఇంటర్‌ అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.25 వేల జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

2. Fresh Minds: ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఈ పోసులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.


3. FUTURZ (Flipkart): ఈ సంస్థలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్ విభాగాల్లో ఈ నియామకాలు ఉన్నాయి. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 12-26 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక:ఈ నెల 30న ఉదయం 10 గంటలకు నలంద డిగ్రీ కాలేజీ, రామ్ నగర్, అనంతపూర్ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios