ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.25 వేల జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
ఎస్‌ఎస్‌బి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులని భర్తీ చేయనుంది.
ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు అద్భుతవకాశం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులని భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్ట్ 22 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌ఎస్‌బీ అధికారిక వెబ్‌సైట్ http://www.ssbrectt.gov.in/ లో చూడవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకొవచ్చు.
మొత్తం ఖాళీలు: 115
భర్తీ చేసే పోస్టులు- హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్/ 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.
also read పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. టెన్త్ పాసైన వారు ఇలా అప్లయ్ చేసుకోండి..
వయస్సు: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: 7th పే కమిషన్‌లోని లెవెల్ 4 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 జీతం వస్తుంది.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్‌సి, ఎస్‌టి, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24 జూలై 2021
దరఖాస్తులకు చివరి తేదీ: 22 ఆగస్టు 2021
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్:http://www.ssbrectt.gov.in/