దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు మరోసారి రైల్వే శాఖ మంచి అవకాశాన్ని అందిస్తోంది.ప్రధాన రైల్వే డివిజన్లలో 9,970 అసిస్టెంట్ లోక్ పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు మరోసారి రైల్వే శాఖ మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే డివిజన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 9,970 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుండగా, దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైయ్యింది. ఇంకా దరఖాస్తు చేయని వారు మే 11లోపు తప్పక అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సికింద్రాబాద్‌ జోన్‌కి 1,500 ఉద్యోగాలు కేటాయించగా, మిగతా డివిజన్లలో అజ్మీర్, అహ్మదాబాద్, భోపాల్, కోల్‌కతా, ముంబయి వంటి నగరాల్లో వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. ముఖ్యంగా రాంచీ జోన్‌లోనే 1,200కి పైగా పోస్టులు ఉన్నాయి.

అర్హత విషయానికి వస్తే, దరఖాస్తు చేసేవారు కనీసం పదో తరగతి పూర్తిచేసి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరోవైపు ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.

వేతనం విషయానికొస్తే, ఉద్యోగం పొందిన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.19,900 నుంచి గరిష్ఠంగా రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. ఇది పోస్టింగ్ స్థానం, సీనియారిటీ, ఇతర ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో ఫామ్‌ను నింపాలి. ప్రస్తుతం అప్లికేషన్ సమయానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.