Jobs : బ్యాంకుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు ... పదోతరగతి అర్హతతో రూ.20,000 సాలరీ జాబ్స్
నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. చివరకు పదో తరగతి విద్యార్హతతో కూడా ఈ జాబ్స్ ఉన్నాయి. వివిధ బ్యాంకుల ఉద్యోగాల భర్తీ వివరాలు...

SBI Jobs
SBI Jobs : వైట్ కాలర్ జాబ్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా ఏసీ కార్యాలయాల్లో కూర్చుని చేసే ఈ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా కోట్లాదిమంది యువత ప్రయత్నిస్తున్నారు. డిగ్రీలు చేతబట్టుకుని ఖాళీగా ఉంటున్న యువతీయువకుల ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బిఐ అద్భుత అవకాశం ఇస్తోంది. దీన్ని అందిపుచ్చుకుని వైట్ కాలర్ జాబ్ పొంది జీవితంలో సెటిల్ కావచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బిఐ బ్యాంకుల్లో వివిధ కేటగిరీ జాబ్స్ ను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇలా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏకంగా 18000 వేల ఉద్యోగులకు భర్తీ చేసుకోనున్నట్లు ఎస్బిఐ చైర్మన్ సీఎల్ శెట్టి ప్రకటించారు.
Bank Jobs
ఎస్బిఐలో ఏఏ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు :
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐలో జాబ్ చేయాలని కోరుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఈ ఏడాది గట్టిగా ప్రయత్నిస్తే ఎస్బిఐలో జాబ్ కొట్టవచ్చు. ఎస్బిఐలో ఏఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారో ఇక్కడ చూద్దాం.
ఎస్బిఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది అత్యధికంగా క్లరికల్ జాబ్స్ ను రిక్రూట్ చేయనుంది ఎస్బిఐ. మొత్తం 18,000 ఉద్యోగాల్లో 13500 నుండి 14000 వేలవరకు క్లర్క్ జాబ్స్ ఉండనున్నాయి. కాబట్టి బ్యాంక్ క్లర్క్ జాబ్స్ కోసం ప్రయత్నించేవారికి ఇది అద్భుత అవకాశం.
SBI Recruitment
ఇక ఎస్బిఐలో ప్రొబెషనరీ ఆఫీసర్ (PO), లోకల్ బేస్డ్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. 3000 వరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఎస్బిఐలో ఉద్యోగాల జాతర ఉండనుందన్నమాట.
UBI Bank Jobs
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ యూనియన్ బ్యాంక్ బ్రాంచుల్లో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250, అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) 250 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. బిటెక్ లేదా పిజి స్థాయి విద్యార్హతలు కలిగినవారు అర్హులు. మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ చూడండి.
Bank of Baroda Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు :
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఆపీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేవలం పదో తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. స్థానిక బాష రాయడం, చదవడం వస్తే చాలు... ఈ ఉద్యోగాలను ఈజీగా పొందవచ్చు. రాత పరీక్ష, స్థానిక బాష పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మే 3 నుండి దరఖాస్తులు ప్రారంభంకాగా మే 23 వరకు అప్లై చేసుకోవచ్చు,