MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Jobs: ల‌క్కీ ఛాన్స్‌, రూ. 60 వేల జీతంతో ప్ర‌భుత్వ ఉద్యోగం.. ఎవ‌రు అర్హులంటే

Jobs: ల‌క్కీ ఛాన్స్‌, రూ. 60 వేల జీతంతో ప్ర‌భుత్వ ఉద్యోగం.. ఎవ‌రు అర్హులంటే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నియోజ‌క‌ర్గాల అభివృద్ధి కోసం ప్ర‌త్యేకంగా ఉద్యోగాల నియామ‌కం చేపడుతోంది. యంగ్ ప్రొఫెష‌నల్ పేరుతో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ చేశారు. మొత్తం ఎన్ని పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు? అర్హత ఏంటి లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

2 Min read
Author : Narender Vaitla
Published : May 05 2025, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Govt Jobs

Govt Jobs

స్వర్ణాంధ్ర విజన్ @2047 కింద ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి యాక్షన్ ప్లాన్ (CVAP) తయారీ, అమలుకు సహాయపడటమే ఈ యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ ముఖ్య విధి. పీ4 (ప్రజలు - ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం) సమన్వయకుడిగా కూడా పనిచేస్తారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రణాళిక, అమలు:

* నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి.

* ఈ ప్రణాళికను స్వర్ణాంధ్ర 2047 దృష్టితో కలిపి అమలు చేయాలి.

* ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, అంశాల ఆధారంగా ప్రోగ్రామ్స్‌ ప్రారంభించాలి.

36
job

job

 పీ4 భాగస్వామ్యం సమన్వయం:

* ప్రైవేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజంతో కలసి పని చేయాలి. 

* ఈ భాగస్వామ్యాల వివరాలు లాగ్‌బుక్‌లో నమోదు చేసి, ఫలితాలు పిరియాడికల్‌గా రిపోర్ట్ చేయాలి.

46

డేటా ఆధారిత పాలనకు మద్దతు:

* నియోజకవర్గ స్థాయిలో మౌలిక వసతులు, సేవల లోపాలు, ఆర్థిక, సామాజిక వివరాలతో ప్రొఫైల్ సిద్ధం చేయాలి.

* ముఖ్య ప్రదర్శన సూచికలు (KPIs) పర్యవేక్షించాలి.

* అవసరమైన పథకాలపై పాలకుల కోసం నివేదికలు తయారు చేయాలి.

* రాష్ట్ర సాంకేతిక బృందంతో కలిసి పని చేయాలి.

56

 ప్రజా భాగస్వామ్యం & పరిపాలన:

* MLAలు, జిల్లా అధికారులు, NGOలు, విద్యా సంస్థలు, ప్రజలతో కలిసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి.

* గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి.

* అభివృద్ధి పనులను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. 

66
job

job

ప్రాజెక్టుల అమలు & సాంకేతిక వినియోగం:

* వ్యవసాయం, మత్స్యశాఖ, MSMEs, విద్య, టూరిజం, రోడ్లు, శుభ్రత, డిజిటల్ సేవలపై ప్రాజెక్టులను అమలు చేయడంలో సహాయం చేయాలి.

* కొత్త సాంకేతికతను ఉపయోగించి సేవల నాణ్యత పెంచాలి.

 పర్యవేక్షణ & మూల్యాంకనం:

* KPIs ఆధారంగా నియోజకవర్గ పురోగతిని మానిటర్ చేయాలి.

* ప్రతి నెలా నివేదికలను పంపాలి.

* అడ్డంకులు ఎదురైతే పరిష్కార మార్గాలు సూచించాలి.

 శిక్షణ:

* GSWS టీమ్‌లకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.

* శిక్షణలు, ఉత్తమ విధానాలపై విజిట్‌లు నిర్వహించాలి.

* ఇతర నియోజకవర్గాలతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. 

 ఇతర బాధ్యతలు:

* నియోజకవర్గ నోడల్ అధికారులు లేదా ప్లానింగ్ శాఖ అప్పగించే ఇతర పనులు కూడా నిర్వర్తించాలి.

జీతం, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? 

ఈ పోస్టుకు ఎంపికైన వారికి ప‌న్నుల‌తో స‌హా కలుపుకొని నెల‌కు రూ. 60,000 జీతం అందిస్తారు. అర్హ‌త విష‌యానికొస్తే పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. 2025 మే 13 ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థుల‌ను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Related Stories
Recommended image1
Farmer registry: ఈ కార్డు లేక‌పోతే ప‌థ‌కాలు ఏవీ రావు. వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved