పెంచిన సింహం దాడిలో మృతి చెందిన జూ కీపర్.. ఆహారం పెడుతుండగా అటాక్...
సింహాలను రక్షించే వ్యక్తి సింహాల బారిన పడి మరణించిన ఘటన నైజీరియాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో జూ కీపర్ మృతి చెందాడు.
నైజీరియా : ఒలావుయి అనే వెటర్నరీ టెక్నాలజిస్ట్ ఒకరు తాను తొమ్మిదేళ్లుగా సంరక్షిస్తున్న సింహం దాడిలో మృతి చెందాడు. ఆ సింహం పుట్టినప్పటినుంచి అతనే వాటి ఆలనా పాలనా చూస్తున్నాడు. ఈ మేరకు నైజీరియా విశ్వవిద్యాలయ ప్రతినిధి చెప్పారు. తెలిపారు.
దాదాపు దశాబ్ద కాలంగా సింహాలను సంరక్షిస్తున్న జూకీపర్‌ని నైజీరియా యూనివర్సిటీలో ఓ సింహం దాడిచేసి చంపేసింది. బీబీసీ వార్తా సంస్థ ప్రకారం, ఒబఫెమి అవలో విశ్వవిద్యాలయం (OAU)లోని జంతుప్రదర్శనశాలకు ఒలబోడ్ ఓలావిఈ బాధ్యత వహిస్తున్నారు. సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా అతడిపై దాడి జరిగింది. అతని సహచరులు అతనిని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆ సింహాలలో ఒకటి అప్పటికే అతనిని తీవ్రంగా గాయపరిచిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Vladimir Putin: లేటు వయసులో ఘాటు ప్రేమ.. 32 ఏళ్లు చిన్నదైన యువతితో పుతిన్ ప్రేమాయణం..!
ఈ ఘటన తరువాత ఆ సింహాన్ని కాల్చి చంపారని జూ సిబ్బంది తెలిపారు. మిస్టర్ ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్ క్యాంపస్ లో తొమ్మిదేళ్ల క్రితం ఈ సింహాలు పుట్టినప్పటినుంచి వాటిని చూసుకుంటున్నారు. అని యూనివర్సిటీ ప్రతినిధి అబియోదున్ ఒలరేవాజు తెలిపారు. "విషాదకరంగా, మగ సింహం తమకు ఆహారం ఇస్తున్న వ్యక్తిని చంపేసింది. ఆ మగ సింహం అలా ఎందుకు దాడి చేసిందో.. ఏమైందో మాకింకా అర్థం కావడం లేదు" అని ఒలరేవాజు చెప్పారు.
యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే, ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ఈ సంఘటనను దురదృష్టకరం అన్నారు. జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతో "మానవ తప్పిదం" వల్ల దాడి జరిగిందని అన్నారు. అకిన్రేమి ఒలావుయికి నివాళులర్పిస్తూ.. ‘మంచి వ్యక్తి, జూకి వెళ్ళినప్పుడల్లా మాకు చక్కగా గైడ్ చేసేవారు" అని గుర్తు చేసుకున్నారు.
ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు కూడా ఈ ఘటనను దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. దీనిమీద అతనేమైనా ప్రభావితం అయ్యారా? అని ప్రశ్నించినప్పుడు.. "ఈ సంఘటన నన్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేయదు. ఎందుకంటే నేను చనిపోయే వరకు సింహాలకు ఆహారం ఇచ్చే పనే చేయాలనుకుంటున్నాను" అని అన్నారు.
అంతకుముందు ఓసారి తాను ఆహారం ఇస్తున్న సమయంలో బబూన్ తన వేలిని కొరికిందని.. ఇప్పటివరకు ఇదే తన జీవితంలో ఎదురైనచెత్త అనుభవం అని చెప్పాడు. ఈ సంఘటన తరువాత, ఒసున్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో జరిగిన మౌలింగ్ గ్రాఫిక్ ఫొటోలను సోషల్ మీడియాలో నైజీరియన్లు షేర్ చేశారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇదిలా ఉంటే, మనదేశంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తిని చంపింది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 38 ఏళ్ల ప్రహ్లాద్ గుజ్జర్ అనే వ్యక్తి లయన్ ఎన్ క్లోజర్ లోకి వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. అతడిని అందులోకి వెళ్లొద్దని కేర్‌టేకర్ చేసిన హెచ్చరికలను వినలేదు. అతను 25 అడుగుల మించి ఎత్తు ఉన్న కంచె దూకి మరీ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. దొంగల్‌పూర్ అనే పేరున్న ఆ సింహం, దాని కేర్ టేకర్ చూసే ముందే గుజ్జర్‌ను చంపేసింది.