ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్రంప్‌ల మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు నోట మూడో ప్రపంచ యుద్ధం అన్న మాట రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. కాగా ఈ భేటీ తర్వాత జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు..
కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పలు దేశాలు ఉక్రెయిన్ కి మద్ధతు నిలిచాయి. మీడియా ముందు ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన వాగ్వాదంపై పలు దేశాలు ఖండించాయి కూడా. ఇదిలా ఉంటే ట్రంప్‌తో చర్చ తర్వాత జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. తన దేశానికి శాంతితో పాటు, నాటో సభ్యత్వం లభిస్తే తాను పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయమై స్కై న్యూస్ తో మాట్లాడుతూ.. 'నా రాజీనామా వల్ల ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం లభిస్తుందని అంటే, నేను దానికి అంగీకరిస్తాను' అని చెప్పుకొచ్చారు.
ఈ విషయమై జెలెన్ స్కీ ఇంకా మాట్లాడుతూ.. 'దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు. నన్ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా ఆపాలి. అది అంత సులువైన పనికాదు. నన్ను తొలగించడం కూడా అంత సులువైన విషయం కాదు' అంటూ ఓవల్ కార్యాలయంలో డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.
బ్రిటన్ నుంచి తిరిగి వచ్చే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా మాట్లాడుతూ అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్‌కు ఉక్రెయిన్ పౌరసత్వం ఇవ్వగలనని అన్నారు. "లిండ్సే గ్రాహం ఉక్రెయిన్ పౌరుడు అయితే, అధ్యక్ష ఎన్నికలపై ఆయన అభిప్రాయం వింటాను" అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్‌లో మాత్రమే జరుగుతాయని, మరే ఇతర దేశంలోనూ జరగవని జెలెన్స్కీ చమత్కరించారు.
కింగ్ చార్లెస్‌తో సమావేశం, సాండ్రింగ్‌హామ్ పర్యటన
జెలెన్స్కీ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌ను కలిశారు. తన బ్రిటన్ పర్యటనలో ఆయన లండన్‌లో జరిగిన భద్రతా సదస్సులో కూడా పాల్గొన్నారు. అక్కడ పలువురు ప్రపంచ నాయకులతో ఉక్రెయిన్ భద్రత గురించి చర్చించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్బంగానే జెలెన్స్కీ ఈ వివరాలను పంచుకున్నారు. మరి జెలెన్స్కీ వర్సెస్ ట్రంప్ అన్నట్లు సాగుతోన్న ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
