Ayodhya: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు.. అయోధ్యకు 21న ప్రయాణం

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. 22న ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 21వ తేదీనే ఆయన అయోధ్యకు బయల్దేరనున్నారు.
 

tdp chief chandrababu naidu to attend ayodhya ram temple consecration ceremony will leave for jan 21st kms

Chandrababu: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఈ ఆహ్వానాన్ని అందించిన సంగతి తెలిసిందే.  22న ఈ కార్యక్రమం జరుగుతున్నది. చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. అందుకు ఒక రోజు ముందు 21వ తేదీన సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు.

ఈ నెల 22న మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్య రామ మందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టత కార్యక్రమం జరుగుతుంది. గురువారమే గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం అందిస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రిక పంపిణీని అధికారులు ఇంకొంచెం వేగవంతంగా చేశారు. 

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవి, ఆయ తనయుడు రామ్ చరణ్‌కు, సినీ హీరో ప్రభాస్‌కు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ ఆహ్వాన పత్రిక అందింది.

Also Read: Secret Code: యువకుడి సూసైడ్ నోట్‌లో సీక్రెట్ కోడ్.. పోలీసులు క్రాక్ చేయడంతో ఖంగుతినే విషయం వెలుగులోకి..!

ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కూటమి పార్టీలు వెళ్లడం లేదు. బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయ లబ్ది కోసం చేపడుతున్నదని, ఆ తర్వాత ఆలయానికి వెళ్లుతామని పలు పార్టీలు ప్రకటించాయి. ఎన్టీఏలో లేదా ఇండియా కూటమిలో లేని చంద్రబాబు.. ఈ కార్యక్రమానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలోనూ మోడీని చంద్రబాబు నాయుడు పొగిడారు. కానీ, ఎన్డీఏలోకి చంద్రబాబు పార్టీని చేర్చుకోవడంపై బీజేపీ వెనుకాముందు ఆడుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ కార్యక్రమానికి వెళ్లుతుండటం గమనార్హం. మరోవైపు ఏపీలోని ఎన్డీయే భాగస్వామి జనసేనతో టీడీపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల వరకు బీజేపీ కూడా జనసేన టీడీపీతో కలిసి నడుస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios