స్విమ్మింగ్ ఫూల్ లో ఓ మహిళ చేస్తున్న క్యాట్ వాక్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీటిలో తలకిందులుగా నడుస్తన్న వీడియోకు 54.1 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.
ప్రతీ రోజు ఇంటర్నెట్ లో వందల రకాల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మాత్రమే అందరి దృష్టిని ఆకర్శిస్తాయి. ఈ వీడియోల్లో పలువురు తమ ప్రతిభను ప్రదర్శిస్తే మరి కొందరు వింతలను వెలుగులోకి తెస్తారు. నిత్య జీవితంలో జరిగే ఘటనలు, విచిత్రాలు, రోజు వారీ సమాచారాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.
ఓరి నాయనో.. మూత్ర విసర్జన సమయంలో నొప్పి.. జననాంగాన్ని గొడ్డలితో నరుక్కున్న వృద్ధుడు..
తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ మహిళ ఆ వీడియోలో తన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించింది. స్విమ్మింగ్ పూల్‌లో తలకిందులుగా క్యాట్ వాక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్టిమకుషా అనే యూజర్ దీనిని షేర్ చేశారు. ‘‘ ది డెవిల్ వేర్ ప్రాడా. మీరు మెరుగైన కోణం కోసం మీ ఫోన్‌ని తిప్పవచ్చు’’ అని కాప్షన్ పెట్టారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ మహిళ పేరు క్రిస్టినా మకుషెంకో సింక్రొనైజ్డ్. ఆమె స్విమ్మింగ్‌లో నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్. ఆమె హైహీల్స్ ధరించి ఒక కొలనులో తలకిందులుగా నడుస్తున్న సమయంలో వీడియో ప్రారంభమవుతుంది. అయితే ఆమె అకస్మాత్తుగా పూర్తిగా 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈ సమయంలో స్విమ్మింగ్ ఫూల్ దిగువ నుంచి ఒక బ్యాగ్‌ను పట్టుకుని దానిని తన భుజంపై వేసుకుని మళ్లీ నేరుగా నడుస్తుంది.
వాస్తవానికి ఈ వీడియో జులైలో షేర్ అయ్యింది. కానీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 54.1 మిలియన్లకు పైగా వ్యూవ్స్, 1.7 మిలియన్లకు పైగా లైక్‌లను పొందింది. ఎంతో మంది ఈ వీడియో కు కామెంట్స్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. క్రిస్టినా మకుషెంకో సింక్రొనైజ్డ్ టాలెంట్ ను ప్రశంసించారు.
పుదుచ్చేరిలో దారుణం: స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధిని చంపిన తల్లి
‘‘ మీకు మంచి ట్యాలెంట్ ఉంది. మీరు నీటిలో చేసిన వాక్ నన్ను ఆశ్చర్యపర్చింది. ’’ అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ‘‘ మీరు క్యాజువల్ గా నీటి అడుగున షికారు చేస్తున్నారు ’’ అని పేర్కొన్నారు. ‘‘మీరు మీ కాళ్లు, చేతులు కదిలిస్తే అస్సలు నీరు కదలకుండా ఎలా ఉంటోంది ? ఇది చాలా అద్భుతంగా ఉంది ’’ అని మూడో యూజర్ కామెంట్ చేశారు.
ద్రవ్యోల్బణం, జీఎస్టీపై నేడు కాంగ్రెస్ భారీ నిరసన.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా ర్యాలీ
మకుషెంకోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా తన ఫోటోలు, స్విమ్మింగ్ వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ వీడియోలను అనేక మంది యూజర్స్ ఇష్టపడతారు. ఆమె పోస్ట్ చేసే వీడియోలకు చాలా వ్యూవ్స్ వస్తాయి.
