గటగటా నీళ్లు తాగేసింది.. మెదడు వాచిపోయి మరణించింది.. ఏం జరిగింది?

అమెరికాకు చెందిన 35 ఏళ్ల మహిళ వెకేషన్‌లో బయట ఎండలో తిరిగి డీహైడ్రేట్ అయినట్టు భావించింది. 20 నిమిషాల్లోనే రెండు లీటర్ల నీళ్లు తాగేసింది. ఆమె వాటర్ టాక్సిసిటీ బారిన పడి ప్రాణాలు విడిచింది.
 

woman consumed two liters of water in 20 minutes dies later by water toxicity kms

అమెరికాకు చెందిన 35 ఏళ్ల మహిళ కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. మండిపోతున్న ఎండలకు తాళలేక వెంటనే గటగటా నీళ్లు తాగేసింది. 20 నిమిషాల్లో రెండు లీటర్ల నీళ్లు తాగింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. హాస్పిటల్ తరలించారు. ఆమె మెదడు వాచిపోయింది. ఆమె మళ్లీ స్పృహలోకి రాలేకపోయింది. 35 ఏళ్ల అష్లీ సమ్మర్స్ మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియానాకు చెందిన అష్లీ సమ్మర్స్ కుటుంబంతో కలిసి జులైలోని నాలుగో వారంలో వెకేషన్‌కు వెళ్లింది. ఎండ తాకిడికి ఆమె డీహైడ్రేట్ అయినట్టుగా భావించింది. నాలుగు బాటిళ్ల నీళ్లు తక్కువ సమయంలోనే తాగేసింది. 

అష్లీ సోదరుడు డివాన్ మిల్లర్ మాట్లాడుతూ.. 20 నిమిషాల్లోనే ఆమె నాలుగు బాటిళ్ల నీరు తాగిందని నాకు చెప్పారు. అంటే 64 ఔన్సుల నీళ్లను (సుమారు రెండు లీటర్ల నీళ్లు) 20 నిమిషాల్లోనే తాగేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గ్యారేజీ లోనే స్పృహ కోల్పోయింది. మళ్లీ స్పృహలోకి  రాలేదు. ‘నా సోదరి ఫోన్ చేసింది. ఆమె దాదాపు పగిలిన గొంతుతో మాట్లాడింది. అష్లీ సమ్మర్స్ హాస్పిటల్‌లో ఉన్నదని చెప్పింది. ఆమె బ్రెయిన్ వాస్తున్నదని, అందుకు కారణమేంటో, దాన్ని ఎలా ఆపాలో ఎవరికీ తెలియడం లేదు. ఇక్కడ ఏం బాగాలేదు’ అని చెప్పిందని మిల్లర్ వివరించాడు. 

వైద్యులు మాట్లాడుతూ.. అష్లీ సమ్మర్స్ హైపోనెట్రేమియాతో మరణించిందని, దీన్నే వాటర్ టాక్సిసిటీ అని కూడా పిలుస్తారని చెప్పారు. రక్తంలో సోడియం లెవెల్స్ దారుణంగా పడిపోయినట్టు ఇలా జరుగుతుందని మెయో క్లినిక్ చెప్పింది. ‘మేమంతా నిర్ఘాంతపోయాం. వాటర్ టాక్సిసిటీ గురించి వారు  మాట్లాడుకున్నారు. అసలు ఇదొక సమస్యేనా అనిపించింది’ అని మిల్లర్ గుర్తు చేసుకున్నాడు.

Also Read: సిక్కులను ఇంకా చంపాల్సింది.. నా పరువు తీశారు.. మూకతో జగదీశ్ టైట్లర్ అన్నారని సీబీఐ చార్జిషీట్

తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగితే ఇలాంటి సమస్య రావొచ్చు. బయట పని చేసే వారు, తరుచూ ఎక్సర్‌సైజులు చేసే వారికి సమ్మర్‌లో ఇలాంటి ముప్పు సంభవించే అవకాశాలు ఎక్కువ అని టాక్సికాలజిస్ట్ డాక్టర్ బ్లేక్ ఫ్రొబెర్గ్ తెలిపారు. అయితే ఈ సమస్య బారినపడటానికి మరి కొన్ని అంశాలు కూడా దొహదం చేయవచ్చని వివరించారు. ‘మొత్తంగా చెప్పొచ్చేదేమంటే.. నీ బాడీలో ఎక్కువ నీరు.. సోడియం సరిపడా లేనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడవచ్చు’ అని వివరించారు. కాబట్టి, ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం కలిగిన డ్రింక్స్ తీసుకోవడం మంచిది అని సూచనలు ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios