Asianet News TeluguAsianet News Telugu

గాండ్రిస్తున్న సింహాన్ని చేతుల్లో బంధించి.. రోడ్డుపై సింపుల్‌గా నడుచుకుంటూ ఓ మహిళ.. షాకింగ్ వీడియో వైరల్

ఓ మహిళ చేతుల్లో గాండ్రిస్తున్న సింహాన్ని సింపుల్‌గా పొదివి పట్టుకుంది. ఆమె చేతుల నుంచి తప్పించుకోవడానికి సింహం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమె గట్టిగా బంధించి రోడ్డుపై సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సింహాన్ని సింపుల్‌గా రోడ్డుపై మోసుకెళ్తున్న షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

woman carrying lion in arms.. shocking video viral
Author
New Delhi, First Published Jan 5, 2022, 1:25 PM IST

న్యూఢిల్లీ: సింహం(Lion) గాండ్రింపుల చప్పుడే వణుకు పుట్టిస్తుంది. అది ఎదురుగా కనిపిస్తే.. పరుగు లంకించుకునుడే శరణ్యం. జూలో చూడటానికి రెండో సారి ఆలోచన చేసేంత భయం ఉంటుంది. అలాంటిది.. ఆ సింహానికి ఎదురుపడటమే కాదు.. ఏకంగా దాన్ని తన చేతుల్లో బంధించింది ఓ మహిళ. అంతేనా, గాండ్రిస్తూ.. ఆమె చేతుల నుంచి బయటపడటానికి సింహం రక్కుతుండగా ఆమె దాన్ని మోస్తూ(Carry) సింపుల్‌గా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. గాండ్రిస్తున్న సింహాన్ని చేతు(Arms)ల్లో బంధించి ఆమె రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తున్నది. కంచె కూడా లేకుండా బహిరంగంగా ఒక సింహాన్ని చూడటమే కాదు.. దాన్ని  చేతుల్లో బంధించి ఎత్తుకెళ్లుతుండటాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఈ ఘటన మిడిల్ ఈస్ట్ కంట్రీ కువైట్‌(Kuwait)లో చోటుచేసుకుంది. ఈ సింహం సంరక్షక ప్రాంతాన్ని వదిలి బయట అడుగు పెట్టింది. ఏకంగా ప్రజలు నివాసముంటున్న వీధుల్లోకి వచ్చింది. దీంతో కువైట్ నగరం వణికిపోయింది. ఇలా సింహం రోడ్డుపై తిరుగుతుండటాన్ని చూసి చాలా మంది హడలెత్తిపోయారు. సబహియా ఏరియా అధికారులకు ఈ విషయమై ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. అక్కడి ఎన్విరాన్‌మెంటల్ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు.

Also Read: అరుదుల్లోకెల్లా అరుదు.. వారిద్దరూ ట్విన్స్.. కానీ, వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు..!

ఆ మహిళనే ఎత్తుకెళ్తున్న సింహానికి యజమాని అని పోలీసు వివరించారు. ఆ మహిళ, ఆమె తండ్రి పెంచుకుంటున్నారని తెలిపారు. ఆ సింహాన్ని పట్టుకోవడంలో తాము సహకరించామని పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని యజమానులకు అప్పగించామని తెలిపారు. కువైట్‌లో ఇలా సింహం, పులులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చట్ట వ్యతిరేకం. అయినప్పటికీ కొందరు వీటిని సంప్రదాయంగా పెంచుకుంటూనే ఉన్నారు. తరాలుగా వాటిని పెంచుకుంటున్నామని, ఇప్పుడు చట్టం చేసినంత మాత్రానా ఆ సంప్రదాయాన్ని వదులుకోలేమని కొందరు చెబుతున్నారు. అందుకే ఈ జంతువులను పెంచుకునే యజమానులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వారి ప్రాబల్యాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ, సింహం, చిరుత, పులులను పెంచుకునే సంప్రదాయాన్ని వీడటం లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు ఈ సంప్రదాయంపై విరుచుకుపడుతున్నారు. వన్యప్రాణాలను అడవిలోనే వదిలిపెట్టాలని సూచనలు చేస్తున్నారు. 2018లోనూ కువైట్ ఇలాంటి ఓ భారీ సింహం వీధుల్లో తిరుగుతున్న వీడియోను షేర్ చేసింది. ఆ సింహాన్ను పట్టుకుని దానికి మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని జూ అధికారులకు అప్పగించారు.

Also Read: ఆత్మలతో మాట్లాడటానికి ఇల్లు వదిలిన బాలిక.. రెండు నెలలుగా ఆచూకీ లేదు

ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తచ్చాడుతూ ఓ వైరల్ వీడియోలో కనిపించాడు. అటూ ఇటూ తిరుగుతూ.. చివరి ట్రాక్‌పై ట్రైన్ వస్తుండగా.. వెంటనే ఆయన ఆ ట్రాక్‌పై పడుకున్నాడు. ఓ ట్రాక్‌పై నడము వరకు పడుకుని తల వైపు భాగాన్ని బయటకు ఉంచాడు. ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లితే రెండు ముక్కలు అయ్యేవాడు. కానీ, ఆ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్ ఎదురుగా ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నాడని గ్రహించాడు. అంతే వేగంగా అలర్ట్ అయి.. ట్రైన్‌కు ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. ఇంకేముంది.. తనపై నుంచి వెళ్తుందనుకున్న ట్రైన్ తనకు కొంత దూరంలో నిలిచిపోయింది. బహుశా ఆయన కళ్లు మూసి ఉన్నాడేమో.. ట్రైన్ అక్కేడ ఆగి ఉన్నా ట్రాక్‌పై నుంచి లేవలేదు. మహారాష్ట్ర రాజధాని ముంబయికి సమీపంలోని శివ్రి పోలీసు స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios