బ్రెజిల్‌లో ఓ మహిళ పొరుగింటిలోని కుక్క ఎక్కువగా మొరుగుతున్నదని పాతిపెట్టింది. యజమాని వచ్చి నిలదీయగా.. పాతిపెట్టినట్టు చెప్పింది. వెంటనే ఆ యజమాని మట్టిని తవ్వితీసింది. పాతిపెట్టి గంటన్నర గడిచినా ఆ కుక్క సజీవంగానే ఉన్నది.
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉన్న ఓ కుక్క ఎక్కువగా మొరుగుతున్నదని బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ దాన్ని సజీవ సమాధి చేసింది. ఆ కుక్క యజమాని వచ్చి గొడవ పెట్టుకుని కుక్క ఏదని అడగ్గా.. తానే ఆ కుక్కను సజీవంగా సమాధి చేసినట్టు చెప్పింది. ఆ లొకేషన్‌ను కూడా చూపించింది. ఆ యజమాని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి మట్టి తవ్వి తీసింది. గంటన్నర తర్వాత కూడా ఆ కుక్క సజీవంగానే కనిపించింది. వెంటనే ఆ కుక్కను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని ప్లానురా మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.
33 ఏళ్ల మహిళకు నీనా అనే పెంపుడు కుక్క పిల్ల ఉన్నది. ఆ కుక్క పిల్ల ఎక్కువగా మొరుగుతున్నదని, ఆ అరుపుల కారణంగా తనకు నిద్ర భంగమవుతున్నదని పొరుగింట్లో ఉండే 82 ఏళ్ల గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత కుక్కను పట్టుకెళ్లి గార్డెన్‌లో గొయ్యి తవ్వి పాతిపెట్టింది.
Also Read: మహిళా డాక్టర్‌ను హతమార్చిన బాయ్‌ఫ్రెండ్.. కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం.. జమ్ములో ఘటన
ఆ తర్వాత కుక్క యజమాని దాని గురించి వెతుకుతూ అనుమానంతో 82 ఏళ్ల పొరుగింటి మహిళను నిలదీసింది. అందుకు ఆ కుక్కను తానే పాతిపెట్టినట్టు చెప్పి.. సమాధి చేసిన ప్రాంతాన్నీ చూపించింది. వెంటనే ఆమె అక్కడికి వెళ్లి మట్టి తవ్వితీసింది. పాతిపెట్టి గంటన్నర దాటినా నీనా సజీవంగానే ఉన్నది. వెంటనే ఆమె ఆ కుక్కను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది.
తాను చేసిన పని గురించి ఆ పొరుగింటావిడ పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. పోలీసుల ముందూ ఆమె చేసిన పనిని అంగీకరించింది. అంతేకాదు, ఆ కుక్క అలాగే మొరిగితే మళ్లీ పాతిపెడతానని చెప్పింది. జంతువులతో సరిగా వ్యవహరించలేదని ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్నారు.
