అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం వైట్ హౌస్ లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ అధికారికి సోకడం సంచలనం రేపింది. అమెరికా ఉపాధ్యక్షుడు మికీ పెన్సీ బృందంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

Also Read కరోనావైరస్: ఇటలీలో దారుణం.. చైనా ను బీట్ చేసింది..

మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ అధికారికే కరోనా వైరస్ సోకడంతో అమెరికా అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అమెరికన్లు వణికిపోతున్నారు.

ఇదిలా ఉండగా... గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. మరోవైపు అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 230కి చేరింది. దీంతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. గత 50గంటల్లో 10వేల కొత్త కేసులు నమదు కావడం గమనార్హం. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటింది.