చైనాలో చైనా తరహా ప్రజాస్వామ్యం ఉన్నదని జీ జిన్ పింగ్ ఈ రోజు అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. అమెరికాకు అమెరికా తరహా ప్రజాస్వామ్యం ఉన్నట్టూ తమకే చైనా తరహా ప్రజాస్వామ్యం ఉన్నదని పేర్కొన్నారు. 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరుచూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా నియంతృత్వ వ్యవస్థలపై విమర్శలు చేస్తుంటారు. పరోక్షంగా చైనాను టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇరువురూ సమావేశం అయ్యారు. ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించిన చర్చ వచ్చింది. ఈ చర్చలో జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు చైనా అధికారిక మీడియా ఈ సమావేశాన్ని గురించి రాసిన కథనం పేర్కొంది.

సోకాల్డ్ డెమోక్రసీ వర్సెస్ అథారిటేరియనిజం వ్యాఖ్యానం నేటి ప్రపంచ లక్షణాన్ని నిర్వచించదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. ఇది ప్రస్తుత కాలానికి సరిపోని వ్యాఖ్యానం అని వివరించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు.. ఇవన్నీ మానవాళి స్థిరంగా ఎల్లప్పుడూ కోరుకునే అంశాలు అని ఆయన పేర్కొన్నట్టు కథనం తెలిపింది. ఇందుకోసం మానవాళి నిరంతరం పోరాడుతుందని వివరించారు. ఇలాగే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. అమెరికాకు అమెరికా తరహా ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు చైనాకు చైనా తరహా ప్రజాస్వామ్యం ఉన్నదని వివరించారు.

Also Read: అగ్గితో చెలగాటమాడితే.. మాడిపోతారు: తైవాన్ అంశంపై బైడెన్‌కు జిన్‌పింగ్ ఘాటు వార్నింగ్

చైనాలో ఒకే పార్టీ ఉండటంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి అంశాల కారణంగా చైనాను ఒక నియంతృత్వ దేశంగా పాశ్చాత్య నేతలు, మేధావులను పేర్కొంటూ ఉంటారు. చైనాలో స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ లేదని, మీడియా పైనా స్వేచ్ఛ లేదని చెబుతున్నారు. 

గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంద మంది ప్రపంచ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రపంచం హక్కులు, ప్రజాస్వామ్యం వంటివి తిరోగమిస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో అందరూ నోరు మూర్చుకుని కూర్చోవాలా? లేదా అందరూ ధైర్యంగా కలిసి ఉండి ఒక విజన్‌ను తయారు చేసుకోవాలా? అని అడిగతారు. అయితే, ఈ సమావేశానికి చైనాను పిలువకపోవడం గమనార్హం. ఇది కచ్చితంగా విచ్ఛిన్నరక నిర్ణక్ష్మే అని చైనా కొట్టివేసింది.