చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఘాటుగా మాట్లాడారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని, చైనాలో తైవాన్ అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. చైనా దాని సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని దాదాపు చెప్పేశారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోకూడదని, తమను రెచ్చగొట్టద్దని సూటిగా స్పష్టం చేశారు. అగ్గితో చెలగామాడితో మాడి మసైపోతారని హూంకరించారు. ఈ విషయాన్ని అమెరికా సరిగ్గా, సమగ్రతంగా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్టు అన్నారు. తైవాన్ అంశమై అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్నది. ఈ తరుణంలోనే ఉభయ దేశాల అధ్యక్షులు సుమారు రెండు గంటలపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించి చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా కీలక కథనం ప్రచురించింది.
తైవాన్ అంశంపై చైనా ప్రభుత్వం, చైనా ప్రజల వైఖరి చాలా స్పష్టంగా ఉన్నదని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలిపారు. చైనాలోని 1.4 బిలియన్ ప్రజలు, చైనా ప్రభుత్వం దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను రక్షించడంపై దృఢ వైఖరితో ఉన్నారని వివరించారు.
త్వరలోనే బైడెన్ శిబిరం నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి తైవాన్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. నాన్సి పెలోసి కూడా ఇంకా ధ్రువీకరించలేదు. కానీ, ఈ పర్యటనకు అమెరికా, చైనాల మధ్య పరిస్థితులను దారుణంగా దిగజార్చే శక్తి ఉన్నది. ఈ పర్యటన (ఒక వేళ జరిగితే) పై చైనా చాలా సీరియస్‌గా ఉన్నది. నాన్సి పెలోసి పర్యటనను రెచ్చగొట్టుడుగానే చైనా చూస్తున్నది. అందుకే ఈ ట్రిప్ జరిపితే మాత్రం తదుపరి పరిణామాలను ఎదుర్కోవాలని చైనా బుధవారం వార్నింగ్ ఇచ్చింది.
నాన్సి పెలోసి తన పర్యటన కోసం మిలిటరీని అడిగినా అందించి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లే తెలిపారు.
