Asianet News TeluguAsianet News Telugu

ఈ ఆరు లక్షణాలు కూడ కరోనాకు సూచికలే: సీడీసీ అధ్యయనం

ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో పాటు ఇంకా మరో ఆరు లక్షణాలు కూడ కరోనాకు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో కరోనా లక్షణాలు తొమ్మిదిగా తేల్చారు.

Watch out for these 6 new coronavirus symptoms
Author
UK, First Published Apr 28, 2020, 10:33 AM IST

వాషింగ్టన్: ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో పాటు ఇంకా మరో ఆరు లక్షణాలు కూడ కరోనాకు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో కరోనా లక్షణాలు తొమ్మిదిగా తేల్చారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం మేరకు ఈ విషయాన్ని గుర్తించింది. రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, గొంతు నొప్పి వంటివి కరోనా లక్షణాల జాబితాలో చేరాయి.కరోనా వైరస్ సోకిన  రెండు రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కన్పించే అవకాశం ఉందని  సీడీసీ స్పష్టం చేసింది. 

రుచి లేదా వాసన గ్రహించే శక్తి లేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా బ్రిటన్ కు చెందిన వ్యాధిగ్రస్తుల్లో ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. కరోనా వైరస్ సోకిన వారికి చలి పెట్టే అవకాశం ఉంది. శీతల దేశాల్లో చలి సాధారణం. అయితే ఈ చలిని తేలికగా తీసిపారేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా కారణంగా చలి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కరోనా సోకిన రోగులు చలికి తట్టుకోలేరు. కరోనా వైరస్ సోకిన రోగి చలికి తట్టుకోలేక పళ్లు కొరికాడు. ఈ విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఇండియాలో వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం. ఈ కాలంలో కూడ చలి పెడుతోందని ఎవరైనా చెబితే వెంటనే వైద్యులకు చూపించాల్సిందే.

ALSO READ:కరోనా ఎఫెక్ట్: వెరైటీ టోపీలతో స్కూళ్లకు చైనా విద్యార్థులు

కరోనా వైరస్ సోకిన వారిలో ఎక్కువగా కండరాల నొప్పులు ఉంటాయని సీడీసీ తెలిపింది. అమెరికాలోని రోగుల్లో ఎక్కువ మంది కండరాల నొప్పితో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లోనే కండరాల నొప్పి ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది.

తలంతా నొప్పిగా ఉండడం, తలంతా నొప్పిగా అన్పించినా దాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తలనొప్పిని సాధారణ నొప్పిగా భావించి అలక్ష్యం చేయవద్దని వైద్యులు కోరుతున్నారు.

గొంతు మంటతో ఉన్న వారికి ఎక్కువగా కరోనా సోకినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. దగ్గు, గొంతు నొప్పితో బాధపడే వారు వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios