బర్గర్లు బుక్ చేస్తే ఎలుకలు ఫ్రీ..!! (వీడియో)

Video shows rodents running through burger buns at Delaware Burger King
Highlights

బర్గర్లు బుక్ చేస్తే ఎలుకలు ఫ్రీ..!! (వీడియో)

సరదాగా కుటుంబం మొత్తం కలిసి తినేందుకు వెల్లింగ్టన్‌కు చెందిన ఒకామె బర్గర్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. డోర్ కొట్టిన శబ్ధం విని.. పార్శిల్ డెలివరీ తీసుకుని ఆనందంగా ప్యాకింగ్ ఓపెన్ చేసి చూసి అవాక్కయ్యింది. అందులో బర్గర్ల మధ్య ఖాళీ స్థలాల్లో ఎలుకలు సంచరిస్తుండటంతో పాటు ఏ మాత్రం శుభ్రత లేదు.. వెంటనే ఆ దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. విషయం ఆ నోటా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాకా వెళ్లడంతో.. వారు సదరు రెస్టారెంట్‌పై దాడి చేసి తనిఖీ నిర్వహించారు. గోడౌన్‌లో బర్గర్లు నిల్వవుంచిన ప్రదేశంలో ఎలుకలు సంచరించడంతో పాటు వాటి మలమూత్రాలు ఆ గదిలో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే రెస్టారెంట్‌ను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జరిగిన తప్పిదంపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ...సదరు రెస్టారెంట్ ఒక స్వతంత్ర వ్యక్తి పర్యవేక్షణలో నడుస్తోందని.. జరిగిన పొరపాటుపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

 

loader