న్యూయార్క్: ఫేస్‌బుక్ సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన  సాంకేతిక సమస్యల కారణంగా  యూజర్ల  వ్యక్తిగత పోస్టులు పబ్లిక్‌గా పోస్టు అయ్యాయి. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ప్రకటించింది.  దీంతో ఫేస్‌బుక్
యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఫేస్‌బుక్  పై ఇప్పటికే డేటా దుర్వినియోగం అయిందనే ప్రచారం ఆ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

ఫేస్‌బుక్ సాఫ్ట్‌వేర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత పోస్టులు వాటంతట అవే పబ్లిక్ మారాయని ఫేస్‌బుక్ ప్రకటించింది. తమ సాఫ్ట్‌వేర్‌లో ఈ బగ్‌ను
గుర్తించినట్టుగా  ఆ సంస్థ ప్రకటించింది.

మే మాసంలోనే 1.4 కోట్ల మంది యూజర్లపై ఈ బగ్ ప్రభావం చూపిందని  ఫేస్‌బుక్ ప్రకటించింది. అయితే ఈ సమస్యకు కారణమైన బగ్ ‌ను గుర్తించి సమస్య పరిష్కారించినట్టుగా  ఫేస్‌బుక్
తెలిపింది. మే 18 నుండి మే 27 వరకు ఈ బగ్ యాక్టివ్ లో ఉందని ఫేస్‌బుక్ ప్రకటించింది. అయితే అంతకుముందు పోస్ట్ చేసిన పోస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేవని  ఫేస్‌బుక్      
ప్రకటించింది. ఎప్పుడైతే ఫేస్‌బుక్ బగ్ యాక్టివ్‌గా ఉందో ఆ సమయంలోనే పోస్టులన్నీ పబ్లిక్‌ ఆఫ్షన్లోకి వెళ్ళాయని ఫేస్‌బుక్ ప్రకటించింది. బగ్ ద్వారా ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్ ను
పంపుతున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.  

ఫేస్‌బుక్ ఫీచర్ ఐటమ్స్ షేర్ చేసుకోవడం కోసం చేసిన మార్పుల సమయంలో  ఈ పొరపాటు చోటు చేసుకొందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ బగ్ కారణంగానే యూజర్లు తమ వ్యక్తిగత
పోస్టులన్నీ కూడ పబ్లిక్‌గా మారాయని ప్రకటించింది. ఏఏ పోస్టులు పబ్లిక్‌గా మారాయనే విషయాన్ని పరిశీలించుకోవాలని ఫేస్‌బుక్ యూజర్లకు సూచించింది.