Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్గనిస్తాన్ లో పరదాల మధ్య తరగతులు... నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు..

యూనివర్సిటీల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు తరగతులు వేర్వేరుగా నిర్వహించాలని, అలా కుదరని పక్షంలో విద్యార్థినీ, విద్యార్థులకు మధ్య పరదాలను ఏర్పాటు చేయాలని తాలిబన్లు హుకూం జారీ చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ వెళ్లే మార్గాలు కూడా వేర్వేరుగా ఉండాలని సూచించారు.

University classes resume in Afghanistan with curtains between male, female students
Author
Hyderabad, First Published Sep 6, 2021, 4:58 PM IST

ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. తరగతులు పరదాల మధ్య కొనసాగుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థులకు మధ్య పరదాలను ఏర్పాటు చేసి, విద్యా సంస్థల యాజమాన్యాలు చదువులు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

యూనివర్సిటీల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు తరగతులు వేర్వేరుగా నిర్వహించాలని, అలా కుదరని పక్షంలో విద్యార్థినీ, విద్యార్థులకు మధ్య పరదాలను ఏర్పాటు చేయాలని తాలిబన్లు హుకూం జారీ చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ వెళ్లే మార్గాలు కూడా వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ హుకుం నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు పరదాల మధ్యలో తరగతులను నిర్వహిస్తున్నారు. 

కాగా, ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లకు కొరకరాని కొయ్యలా మారిన పంజ్ షెర్ ఎట్టకేలకూ తాలిబన్ల వశమయ్యింది. ఈ మేరకు సోమవారం ఉదయం తాలిబన్లు అధికారిక ప్రకటన చేశారు. 

అమెరికా సైన్యం అఫ్గన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్న అనంతర పరిణామాలను హ్యాండిల్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఖతార్‌కి బయలుదేరిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. 

20యేళ్లుగా ఆఫ్గన్ లో తిష్ట వేసిన అమెరికా సైన్యాన్ని దెబ్బకొట్టి మెరుపుదాడితో ఆఫ్గన్ ను వశం చేసుకున్న తాలిబన్లు, గత వారం పూర్తిగా అమెరికా సైన్యం దేశాన్ని వదిలిపోవడంతో సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆధీనంలోకి రాకుండా ఎదురు తిరుగుతున్న పంజ్ షెర్ మీద తాలిబన్లు ఎక్కువ దృష్టి పెట్టారు. 

ఇక పంజ్ షెర్ మీద ఆధిపత్యం సాధించడంతో.. "ఈ విజయంతో, మన దేశం పూర్తిగా యుద్ధం నుండి బయటపడింది" అని ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. 

ఆదివారం అర్థరాత్రి, తాలిబాన్ వ్యతిరేక మిలీషియా, మాజీ ఆఫ్ఘన్ భద్రతా దళాలతో ఏర్పడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (NRF) పంజ్‌షీర్‌ యుద్ధంతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంగీకరించింది. అంతేకాదు, కాల్పుల విరమణకు పిలుపు నిచ్చింది. ఎన్ఆర్ఎఫ్ లో ప్రఖ్యాత సోవియట్ వ్యతిరేక, తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌కు విధేయులైన స్థానిక పోరాట యోధులు, పంజ్‌షీర్ లోయకు చెందిన ఆఫ్ఘన్ మిలిటరీ సభ్యులు ఉన్నారు.

తాలిబన్ల హస్తగతమైన పంజ్ షీర్... ‘దేశం పూర్తిగా యుద్ధం నుండి బయటపడింది..’ అంటూ ప్రకటన..

తాజా పోరులో ప్రముఖ ఆఫ్ఘన్ జర్నలిస్ట్ జనరల్ అబ్దుల్ వుడోద్ జారా మరణించాడని ప్రతినిధి ఫాహిమ్ దాష్తి ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్ఆర్ఎఫ్  తాలిబాన్‌లతో పోరాడతానని ప్రతిజ్ఞ చేసింది. అదే సమయంలో  ఇస్లామిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పింది. అయితే, ఇనిషియల్ కాంటాక్ట్ ఏ బ్రేక్ థ్రూకూ దారితీయలేదు. పంజ్‌షీర్ లోయ 1980 లలో సోవియట్ దళాలకు, 1990 ల చివరలో తాలిబాన్‌లకు ప్రతిఘటన జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

తాలిబాన్లు మూడు వారాల క్రితం కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తరువాత కొత్త పాలన దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం కఠినమైన ఇస్లామిస్టులు కూడా వీరు ఆశ్చర్యపరిచారు.

ఆఫ్గన్ ను హస్తగతం చేసుకున్న తరువాత మొదట అధికారం చేపట్టిన సమయంలో అందర్నీ కలుపుకుని పోతామని.. వాగ్దానం చేశారు. తాలబన్లకు అనేక సంవత్సరాల సంఘర్ణణ తరువాత వచ్చింది. మొదటి సారి 1979 లో సోవియట్ దండయాత్ర, ఆపై రక్తసిక్తమైన అంతర్యుద్ధం ఆఫ్గన్ ను అతలాకుతలం చేశాయి. 

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అక్కడి ప్రభుత్వంలో మహిళలు ఉన్నత స్థాయిలలో చేర్చబడలేదు. తాలిబాన్ల 1996-2001 పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది.

ఇక ఈసారి, విశ్వవిద్యాలయాల్లోని క్లాస్ రూంలలో స్త్రీలకు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేయడం లేదా కనీసం పరదా ద్వారా విభజించబడినంత వరకు మహిళలు విశ్వవిద్యాలయానికి అనుమతించబడరని తాలిబాన్ విద్యా సంస్థ ఆదివారం జారీ చేసిన సుదీర్ఘ పత్రంలో పేర్కొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios