Asianet News TeluguAsianet News Telugu

తాలిబన్ల హస్తగతమైన పంజ్ షీర్... ‘దేశం పూర్తిగా యుద్ధం నుండి బయటపడింది..’ అంటూ ప్రకటన..

అమెరికా సైన్యం అఫ్గన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్న అనంతర పరిణామాలను హ్యాండిల్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఖతార్‌కి బయలుదేరిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. 

Taliban Say Resistance Holdout Panjshir Valley "Completely Captured"
Author
Hyderabad, First Published Sep 6, 2021, 11:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాబూల్ : ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లకు కొరకరాని కొయ్యలా మారిన పంజ్ షెర్ ఎట్టకేలకూ తాలిబన్ల వశమయ్యింది. ఈ మేరకు సోమవారం ఉదయం తాలిబన్లు అధికారిక ప్రకటన చేశారు. 

అమెరికా సైన్యం అఫ్గన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్న అనంతర పరిణామాలను హ్యాండిల్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఖతార్‌కి బయలుదేరిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. 

20యేళ్లుగా ఆఫ్గన్ లో తిష్ట వేసిన అమెరికా సైన్యాన్ని దెబ్బకొట్టి మెరుపుదాడితో ఆఫ్గన్ ను వశం చేసుకున్న తాలిబన్లు, గత వారం పూర్తిగా అమెరికా సైన్యం దేశాన్ని వదిలిపోవడంతో సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆధీనంలోకి రాకుండా ఎదురు తిరుగుతున్న పంజ్ షెర్ మీద తాలిబన్లు ఎక్కువ దృష్టి పెట్టారు. 

ఇక పంజ్ షెర్ మీద ఆధిపత్యం సాధించడంతో.. "ఈ విజయంతో, మన దేశం పూర్తిగా యుద్ధం నుండి బయటపడింది" అని ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. 

ఆదివారం అర్థరాత్రి, తాలిబాన్ వ్యతిరేక మిలీషియా, మాజీ ఆఫ్ఘన్ భద్రతా దళాలతో ఏర్పడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (NRF) పంజ్‌షీర్‌ యుద్ధంతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంగీకరించింది. అంతేకాదు, కాల్పుల విరమణకు పిలుపు నిచ్చింది. ఎన్ఆర్ఎఫ్ లో ప్రఖ్యాత సోవియట్ వ్యతిరేక, తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌కు విధేయులైన స్థానిక పోరాట యోధులు, పంజ్‌షీర్ లోయకు చెందిన ఆఫ్ఘన్ మిలిటరీ సభ్యులు ఉన్నారు.

తాజా పోరులో ప్రముఖ ఆఫ్ఘన్ జర్నలిస్ట్ జనరల్ అబ్దుల్ వుడోద్ జారా మరణించాడని ప్రతినిధి ఫాహిమ్ దాష్తి ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్ఆర్ఎఫ్  తాలిబాన్‌లతో పోరాడతానని ప్రతిజ్ఞ చేసింది. అదే సమయంలో  ఇస్లామిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పింది. అయితే, ఇనిషియల్ కాంటాక్ట్ ఏ బ్రేక్ థ్రూకూ దారితీయలేదు. పంజ్‌షీర్ లోయ 1980 లలో సోవియట్ దళాలకు, 1990 ల చివరలో తాలిబాన్‌లకు ప్రతిఘటన జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

తాలిబాన్లు మూడు వారాల క్రితం కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తరువాత కొత్త పాలన దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం కఠినమైన ఇస్లామిస్టులు కూడా వీరు ఆశ్చర్యపరిచారు.

ఆఫ్గన్ ను హస్తగతం చేసుకున్న తరువాత మొదట అధికారం చేపట్టిన సమయంలో అందర్నీ కలుపుకుని పోతామని.. వాగ్దానం చేశారు. తాలబన్లకు అనేక సంవత్సరాల సంఘర్ణణ తరువాత వచ్చింది. మొదటి సారి 1979 లో సోవియట్ దండయాత్ర, ఆపై రక్తసిక్తమైన అంతర్యుద్ధం ఆఫ్గన్ ను అతలాకుతలం చేశాయి. 

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అక్కడి ప్రభుత్వంలో మహిళలు ఉన్నత స్థాయిలలో చేర్చబడలేదు. తాలిబాన్ల 1996-2001 పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది.

ఇక ఈసారి, విశ్వవిద్యాలయాల్లోని క్లాస్ రూంలలో స్త్రీలకు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేయడం లేదా కనీసం పరదా ద్వారా విభజించబడినంత వరకు మహిళలు విశ్వవిద్యాలయానికి అనుమతించబడరని తాలిబాన్ విద్యా సంస్థ ఆదివారం జారీ చేసిన సుదీర్ఘ పత్రంలో పేర్కొంది.

అయితే గత తాలిబాన్ పాలనలోలాగా మరింత సాంప్రదాయిక బుర్ఖా తప్పనిసరి కాకుండా మహిళా విద్యార్థులు తప్పనిసరిగా అబయా (వస్త్రం), నికాబ్ (ముఖం-వీల్) ధరించాలని తెలిపింది.

తాలిబన్లు తిరుగుబాటుదారుల నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి రావడంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కీలకమైన మానవతా అవసరాలకు సంబంధించి వారికి అంతర్జాతీయ సాయం కావాల్సి ఉంది.  UN హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ తాలిబాన్ నాయకత్వంతో కాబూల్ లో చాలా రోజుల సమావేశాల అయ్యారు. అనంతరం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

పంజ్‌షిర్ రెబల్స్ చేతిలో 700 మంది తాలిబాన్లు హతం? ట్విట్టర్‌లో వెల్లడించిన తిరుగుబాటుదారులు

యూఎన్ ప్రతినిధి స్టెఫేన్ డుజార్రిక్  ఒక  ప్రకటనలో "హ్యుమానిటేరియన్ స్టాఫ్ భద్రత, రక్షణ విషయంలో వారు హామీ ఇచ్చారు. ఈ స్టాఫ్ లో ఉండే మహిళలు, పురుషులకు.. స్వేచ్ఛగా పనిచేసేకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తారని అధికారులు ప్రతిజ్ఞ చేశారు" అని చెప్పారు. తాలిబన్ అధికార ప్రతినిధి దీనిమీద ట్వీట్ చేశారు. 

కొత్త తాలిబాన్ పాలనతో అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైన హంగులతో సరిపెట్టుకుంటుంది. పంజ్ షెర్ లో ఈ ఆక్రమణ జరుగుతున్న సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం ఖతార్‌లో ఉన్నారు. ఇది ఆఫ్ఘన్ సాగాలో కీలక పాత్ర పోషించింది.

అమెరికా ప్రధాన సైనిక స్థావరానికి ఆతిథ్యమిస్తున్న ఖతార్, ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వచ్చిన 55,000 మందికి ఆశ్రయం ఇచ్చింది. ఆగష్టు 15 న తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తరువాత యుఎస్ నేతృత్వంలోని దళాలు దాదాపు సగం మందిని తరలించాయి.

కాబుల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిచేందుకు టర్కీతో కలిసి చేస్తున్న ప్రయత్నాల గురించి బ్లింకెన్ ఖతారీలతో మాట్లాడతారు, ఇది చాలా అవసరమైన మానవతావాద సహాయం అని.. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మిగిలిన ఆఫ్ఘన్‌లను తరలించడానికి అవసరం.

బ్లింకెన్ బుధవారం జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లోని యుఎస్ వైమానిక స్థావరానికి వెళ్తారు. యునైట్ స్టేట్స్ కు తరలిస్తున్న ఆఫ్గన్ ల తాత్కాలిక నివాసం. ఇక్కడి నుంచి అతను జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్‌తో కలిసి సంక్షోభంపై 20 దేశాల మంత్రివర్గాలతో విర్చువల్ సమావేశం నిర్వహిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios