Asianet News TeluguAsianet News Telugu

Bharat: ఇండియాను 'భార‌త్' గా పేరు మార్పు వివాదం మ‌ధ్య ఐరాస కీల‌క వ్యాఖ్య‌లు

India that is Bharat: రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే జీ20 సదస్సు విందుకు పంపిన అధికారిక ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆప్ ఇండియా'కు బదులుగా 'భారత రాష్ట్రపతి' అని పేర్కొనడంతో దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అధికారిక ఆహ్వానంలో ఇండియా పేరులో మార్పును ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం మ‌ధ్య ఐక్య‌రాజ్య స‌మితి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.
 

United Nations's key comments amid controversy over renaming of India as Bharat RMA
Author
First Published Sep 7, 2023, 12:15 PM IST

UN on ‘Bharat’ row: త‌మ పేర్లను మార్చుకోవాలన్న దేశాల విజ్ఞప్తులను ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే జీ20 సదస్సు విందుకు పంపిన అధికారిక ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆప్ ఇండియా'కు బదులుగా 'భారత రాష్ట్రపతి' అని పేర్కొనడంతో దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అధికారిక ఆహ్వానంలో ఇండియా పేరులో మార్పును ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం మ‌ధ్య ఐక్య‌రాజ్య స‌మితి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము జీ20 విందులో తనను 'ప్రెసిడెంట్ ఆప్ ఇండియా'గా కాకుండా 'భారత రాష్ట్రపతి'గా పేర్కొనడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమ పేర్లను మార్చుకోవాలన్న దేశాల విజ్ఞప్తులను ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ బుధవారం టర్కీ తన పేరును తుర్కియేగా మార్చడాన్ని ఉదహరించారు. "తుర్కియే విషయంలో, ప్రభుత్వం మాకు ఇచ్చిన అధికారిక అభ్యర్థనకు మేము ప్రతిస్పందించాము. అలాంటి అభ్యర్థనలు వస్తే వాటిని వచ్చినట్లే పరిగణిస్తాం' అని భారత్ పేరును భారత్ గా మార్చొచ్చన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

జీ-20 విందుకు రాష్ట్రపతి ముర్ము ఆహ్వానాలు పంపడంతో భారత్ లో వివాదం చెలరేగింది. సంప్రదాయ 'ప్రెసిడెంట్ ఆప్ ఇండియా'గా కాకుండా 'భారత రాష్ట్రపతి'గా తన స్థానాన్ని వర్ణిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియాను వదిలేసి కేవలం భారత్ ను దేశ పేరుగా కొనసాగించాలని యోచిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇక భారత్ అంశం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగకుండా చూడాలని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. కేంద్ర మంత్రిమండలితో జరిగిన చర్చల్లో రాబోయే జీ20 సదస్సులో వారు పాటించాల్సిన, చేయకూడని అంశాలను మోడీ వివరించారు.

మెగా ఎక్సర్ సైజ్ సమయంలో దేశ రాజధానిలోనే ఉండాలనీ, విచ్చేసే ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తమకు అప్పగించిన ఏ డ్యూటీనైనా నిర్వర్తించాలని కోరారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios