Asianet News TeluguAsianet News Telugu

United Nations: ప్ర‌భావం చూప‌ని క‌రోనా.. పెరుగుతున్న ప‌ట్ట‌ణ జ‌నాభా : ఐరాస

India's urban population: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల బాట ప‌ట్టారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత మ‌ళ్లీ ప‌ట్ట‌ణాల‌కు చేరుకుంటున్నారనీ, పట్టణీకరణ పై పెద్దగా ప్రభావం చూపలేదని  ఐరాస నివేదిక పేర్కొంది. 

United Nations-Habitat's World Cities Report 2022: India's urban population to stand at 675 million in 2035
Author
Hyderabad, First Published Jun 30, 2022, 12:54 PM IST

United Nations-Habitat's World Cities Report 2022: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ట్ట‌ణ జ‌నాభా క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని ఐక్య‌రాజ్య స‌మితి పేర్కొంది. భారతదేశ పట్టణ జనాభా 2035లో 675 మిలియన్లుగా ఉంటుంద‌ని అంచనా వేసింది. ఇది చైనాలోని  ఒక బిలియన్ జ‌నాభా కంటే త‌క్కువ అయిన‌ప్పటికీ.. ప్ర‌పంచంలో రెండో అత్య‌ధిక ప‌ట్ట‌ణ జనాభాను క‌లిగివుంటుంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి తాజా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుద‌ల కాస్త మంద‌గించింద‌నీ, అయితే, ప్ర‌స్తుతం కోవిడ్‌-19 ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మ‌ళ్లీ ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుద‌ల ట్రాక్ లోకి వ‌చ్చింద‌ని యూఎన్ నివేదిక పేర్కొంది. 2050 నాటికి మరో 2.2 బిలియన్లు ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుతుంద‌ని అంచ‌నా వేసింది. 

బుధవారం విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి-హాబిటాట్  ప్రపంచ నగరాల నివేదిక 2022 లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వేగవంతమైన పట్టణీకరణకు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.  అయితే, ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గ‌డంతో ప‌ట్ణ‌ణీక‌ర‌ణ మ‌ళ్లీ నెమ్మ‌దిగా ప‌రుగు స్టార్ చేసింద‌నీ, ఇది క్ర‌మంగా పెరుగుతుంద‌ని ఐరాస నివేదిక‌ తెలిపింది. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా మరో 2.2 బిలియన్ల జనాభాకు పెరగడానికి ప‌రిస్థితులు మారుతున్నాయ‌ని తెలిపింది. భారతదేశ పట్టణ జనాభా 2035లో 675,456,000గా ఉంటుందని తెలిపిన ఈ నివేదిక‌.. 2020లో 483,099,000 నుండి 2025లో 542,743,000 కు పెరుగుతుంద‌ని పేర్కొంది. అలాగే, 2030లో ప‌ట్ట‌ణ జ‌నాభా 607,342,000కి పెరుగుతుందని నివేదిక అంచ‌నా వేసింది. 2035 నాటికి, భారతదేశంలోని జనాభా శాతం మధ్య సంవత్సరం పట్టణ ప్రాంతంలో నివసించే వారి శాతం 43.2 శాతంగా ఉంటుందని తెలిపింది. 

ఇక ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన చైనాలో ప‌ట్ణ‌ణ జ‌నాభా గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని ఐరాస నివేదిక తెలిపింది. 2035లో చైనా పట్టణ జనాభా 1.05 బిలియన్లుగా అంచనా వేయగా, 2035లో ఆసియాలో పట్టణ జనాభా 2.99 బిలియన్లు మరియు దక్షిణాసియాలో 987,592,000గా ఉంటుందని ఐక్య‌రాజ్య స‌మితి నివేదిక వేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగి రెండు దేశాలు చైనా, భారతదేశం వంటి చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ జనాభాలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయనీ, వాటి అభివృద్ధి పథాలు ప్రపంచ అసమానతలను బాగా ప్రభావితం చేశాయని యూఎన్‌ నివేదిక వెల్ల‌డించింది. "గత రెండు దశాబ్దాలలో ఆసియాలో చైనా, భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని మరియు పట్టణీకరణను  చూస్తున్నాయి.  ఇ ప‌రిస్థితులు పేదరికంలో  మ‌గ్గుతున్న వారి సంఖ్య‌ను భారీగా త‌గ్గించ‌డానికి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి దారితీసింది" అని ఐరాస నివేదిక పేర్కొంది.

వైద్య రంగంలో వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క మార్పుల కార‌ణంగా శిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న జననాల రేటు ద్వారా ఇప్పటికే ఉన్న పట్టణ జనాభా సహజంగా పెరుగుతూనే ఉందని నివేదిక పేర్కొంది. తక్కువ ఆదాయ దేశాల్లో పట్టణ జనాభా 2021లో ప్రపంచ మొత్తంలో 56 శాతం నుండి 2050 నాటికి 68 శాతానికి పెరుగుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ట్ట‌ణ జ‌నాభా గ్రామాల‌కు, చిన్ని ప‌ట్ట‌ణాల‌కు వెళ్లారు. ఈ ప్ర‌భావం ప‌ట్ట‌ణ జ‌నాభాపై చూపుతుంద‌ని ఇదివ‌ర‌కు ప‌లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఇది పెద్ద‌గా ఉండ‌ద‌ని ఐరాస నివేదిక స్ప‌ష్టం చేసింది. ఎందుకంటే క‌రోనా మహమ్మారి ప్రారంభ దశలో ప్రధాన నగరాల నుండి గ్రామీణ ప్రాంతాలు లేదా చిన్న పట్టణాల భద్రతకు స్కేల్ ఫ్లైట్ అనేది స్వల్పకాలిక ప్రతిస్పందన మాత్ర‌మేన‌నీ, కాబ‌ట్టి ఇది ప్రపంచ పట్టణీకరణ ప్ర‌యాణాన్ని పెద్ద‌గా మార్పున‌కు గురిచేయ‌దని తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios