Asianet News TeluguAsianet News Telugu

భారతీయుల క్షేమమే ముఖ్యం.. కానీ, కాబూల్ విమానాశ్రయంతోనే సవాల్: విదేశాంగ మంత్రి జైశంకర్

ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని చెప్పారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. కానీ కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సవాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆఫ్ఘన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని జైశంకర్ వెల్లడించారు.

union foreign minister jai shankar responds on afghan situations
Author
Kabul, First Published Aug 17, 2021, 3:59 PM IST

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్‌ల పాలన మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో, స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు కాబూల్ విమానాశ్రయంలో ఎదురవుతున్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, కానీ కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సవాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆఫ్ఘన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని జైశంకర్ వెల్లడించారు.

అటు కాబూల్ లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాబూల్ లో ఉన్న సిక్కులు, హిందూ సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారత పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యత అని జై శంకర్ స్పష్టం చేశారు.

Also Read:ఆఫ్ఘనిస్తాన్‌‌: కొత్త ప్రభుత్వంపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన

కాబూల్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరివద్ద అయినా కీలక సమాచారం ఉంటే 919717785379 ఫోన్ నెంబరుకు గానీ, MEAHelpdeskIndia@gmail.com ఈమెయిల్ ఐడీకి గానీ అందించాలని సూచించారు

Follow Us:
Download App:
  • android
  • ios