బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసం టెన్ డౌనింగ్ స్ట్రీట్‌ వెలుపల బోరిస్ జాన్సన్ కొద్దిసేపటి క్రితం రాజీనామా ప్రకటన చేశారు. జాన్సన్ ప్రకటనను వినడానికి ప్రజలు డౌనింగ్ స్ట్రీట్ వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడారు. 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసం టెన్ డౌనింగ్ స్ట్రీట్‌ వెలుపల బోరిస్ జాన్సన్ కొద్దిసేపటి క్రితం రాజీనామా ప్రకటన చేశారు. జాన్సన్ ప్రకటనను వినడానికి ప్రజలు డౌనింగ్ స్ట్రీట్ వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ.. ‘‘నా విజయాల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. కొత్త నాయకుడు వచ్చే వరకు నేను కొనసాగుతాను’’ అని తెలిపారు. కొత్త ప్రధాని కావాలనేది ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సంకల్పమని జాన్సన్ చెప్పారు. కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునే టైమ్‌టేబుల్ వచ్చే వారం ప్రకటించబడుతుందని తెలిపారు. 

వ్యక్తిగతంగా ఓటరు ఆదేశాన్ని అందించాలని తాను ఆసక్తిగా ఉన్నందున నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం వేచి ఉన్నానని బోరిస్ జాన్సన్ చెప్పారు. తాను ఏదైతే వాగ్దానం చేశానో.. దానిని కర్తవ్యంగా, బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం, యూకేలో కరోనా మహమ్మారి నియంత్రణ, ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దండయాత్రకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు నాయకత్వం వహించడం వంటి తన విజయాల పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. యూకే తప్పనిసరిగా ఉన్నతస్థాయిని కొనసాగించాలని.. అలా చేయడం వలన తమ దేశం ఐరోపాలో అత్యంత సంపన్నమైనదిగా మారుతుందన్నారు. 

Also Read: Boris Johnson Resign: రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ప్రభుత్వాన్ని మార్చడం "విపరీతమైనది" అని సహచరులను ఒప్పించేందుకు తాను ప్రయత్నించానని.. అయితే ఆ వాదనలలో తాను విజయం సాధించలేకపోయానని చింతిస్తున్నానని జాన్సన్ చెప్పారు. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఉద్యోగాన్ని వదులుకున్నందుకు నేను ఎంత బాధపడ్డానో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను’’ అని చెప్పిన బోరిస్ జాన్సన్.. ఇది తాను ఊహించింది కాదని అన్నారు. కొత్త ప్రధానమంత్రికి తన మద్దతును అందిస్తానని జాన్సన్ చెప్పారు. ఇక, బోరిస్ జాన్సన్ తన భార్య Carrie, పిల్లలు, NHS, సాయుధ దళాలు, డౌనింగ్ స్ట్రీట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 

Scroll to load tweet…

అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో అధికారికంగా కొత్త నాయకుడిని నియమించే వరకు జాన్సన్ అపద్దర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నట్టుగా పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.