అతని ఖాతాలో రూ. 1.24 కోట్లు జమ, ఆ డబ్బూ ఆయనదేనని చెప్పిన బ్యాంక్, చివరకు ఏం జరిగిందంటే?
యూకేకు చెందిన 41 ఏళ్ల ఉర్స్‌లాన్ ఖాన్ బ్యాంకు ఖాతాలో అనుకోకుండా రూ. 1.24 కోట్ల విలువైన పౌండ్లు జమ అయ్యాయి. ఆ డబ్బులు చూసి షాక్ అయ్యాడు. అయితే, ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆశ్చర్యకరంగా వారు కూడా ఆ డబ్బు తనకే చెందుతాయని సమాధానం చెప్పారు. దీంతో మరోసారి ఖాన్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డం తూర్పు లండన్‌లో పొప్లార్ నివాసి అయిన 41 ఏళ్ల ఉర్స్‌లాన్ ఖాన్ బ్యాంకు ఖాతాలో రూ. 1.24 కోట్లు (122,0000 పౌండ్లు) జమ అయ్యాయి. ఆ డబ్బులు చూడగానే ఆయన షాక్ అయ్యాడు. ఆయన ఖాతాలో కేవలం ఒకే పౌండ్ ఉండాల్సింది. కానీ, ఇంత పెద్ద అమౌంట్ చూసి పరేషాన్ అయ్యాడు. ఆ డబ్బులు వెంటనే తన మరో ఖాతాలోకి మార్చుకోవాలనే ఆలోచనలు మాత్రం ఆయన చేయలేదు. బుద్ధిగా ఆ బ్యాంక్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అప్పుడూ ఆయనకు మరో ఆసక్తికర పరిణామం ఎదురైంది. ఆ డబ్బులు ఆయనవేనని, ఏ పొరపాటూ జరగలేదని బ్యాంకు సిబ్బంది ఉర్స్‌లాన్ ఖాన్‌కు చెప్పారు. దీంతో మరోసారి ఆశ్చర్యపడటం ఆయన వంతే అయింది.
అయితే, 24 గంటల తర్వాత అంటే.. ఒక వర్కింగ్ డే పూర్తయిన తర్వాత బ్యాంకు అధికారులు జరిగిన తప్పిదం తెలియవచ్చింది. వెంటనే ఉర్స్‌లాన్ ఖాన్‌ను సంప్రదించారు. పొరపాటుగా ఆ డబ్బులు ఆయన ఖాతాలోకి వచ్చాయని, కాబట్టి, వెనక్కి పంపించాలని కోరారు. దీనికి ఉర్స్‌లాన్ ఖాన్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆ డబ్బులను బ్యాంకు అధికారులకు ట్రాన్స్ ఫర్ చేశారు.
Also Read: ఆ ప్రభుత్వ హాస్పిటల్‌లో 8 రోజుల్లో 108 మంది పేషెంట్లు మృతి
ఆ డబ్బులు వేరే వ్యక్తి ఖాతాలోకి వెళ్లాల్సినవని తనకు అనిపించిందని, పొరపాటున తన ఖాతాలోకి వచ్చాయని రియలైజ్ అయ్యానని ఉర్స్‌లాన్ ఖాన్ చెప్పారు. అయితే, బ్యాంకు అధికారులు కూడా తమ తప్పు తెలుసుకోవడానికి ఒక రోజు పట్టిందని వివరించారు. ఆ డబ్బులు తన కోసం ఎంచుకుంటే తన లైఫ్ మొత్తం ఆర్థిక సమస్యలు లేకుండా గడిచిపోయేవని తెలిపారు. కానీ, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి ఉంటుందని, కానీ, తాను ఆ ఆప్షన్ ఎంచుకోలేదని, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చానని వివరించారు. తాను కావాలనుకుంటే క్షణాల్లో ఆ డబ్బు తన మరో ఖాతాలోకి వెళ్లేవని పేర్కొన్నారు.