ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయం ఉన్న అల్ట్రా సెక్యూర్ గ్రీన్ జోన్ పై రెండు రాకెట్ల దాడి జరిగింది. అయితే ఈ రాకెట్లను కూల్చివేశారు.
బాగ్దాద్: Iraq రాజధాని Baghdad సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయం ఉన్న అల్ట్రా సెక్యూర్ గ్రీన్ జోన్ పై రెండు rocketతో దాడి జరిగిందని ఇరాక్ భద్రతా దళాలు తెలిపాయి. బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పై రెండు కత్యుషా రాకెట్ల దాడి జరిగంది. తొలుత c-ram డిఫెన్స్ బ్యాటరీల ద్వారా గాలిలో కాల్చి వేశారు రెండోది ఒక చతురస్రాకారంలో పడిపోయిందని భద్రతా దళాలు తెలిపాయి. మొదటి రాకెట్ యూఎస్ ఎంబసీ సమీపంలో పడిపోగా, రెండోది 500 మీటర్ల దూరంలో పడిపోయిందని securityవర్గాలు తెలిపాయి.
గతంలో కూడా US Embassy సమీపంలో రెండు రాకెట్లను కూల్చివేసినట్టుగా భద్రతాధికారులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. ఇరాక్‌లో మోహరించిన దాదాపు 2,500 మంది అమెరికన్ సైనికులు వెయ్యి మంది సంకీర్ణ సైనికులు శిక్షణ, సలహాలు ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నారు.ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గాలు దేశంలోని అన్ని యూఎస్ దళాలను విడిచిపెట్టాలనే డిమాండ్ చేస్తున్నాయి. 2003లో సద్దాం హుస్సేన్ పై పదవిని కోల్పోయిన తర్వాత ఇరాక్ నుండి అమెరికా దళాలు నిష్క్రమించిన 10వ వార్షికోత్సవం రోజునే ఈ దాడి జరిగింది.
also read:పాకిస్తాన్: కరాచీలో భారీ పేలుడు.. పది మంది దుర్మరణం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
దేశంలోని పెద్ద ప్రాంతాలు Isis స్వాధీనం చేసుకొన్న ప్రాంతాలను తిరిగి రాబట్టేందుకు యూఎస్ దళాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది నవంబర్ ప్రారంభంలో ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా ఆల్ కదిమి గ్రీన్ జోన్ లోని అధికారిక నివాసాన్ని లక్ష్యంగా దాడి జరిగింది. ఈ డ్రోన్ బాంబు దాడి నుండి ఆయన క్షేమంగా తప్పించుకొన్నారు. సెప్టెంబర్ లో ఇరాకీ కుర్ధిస్తాన్ లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని సాయుధ డ్రోన్ దాడి జరిగింది.
