Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ కెనడా నిర్వాకం.. వాంతి చేసుకున్న సీట్లలో కూర్చోం అన్నందుకు.. 2 మహిళా ప్రయాణీకులను ఫ్లైట్‌ నుంచి దించేసి

వాంతులు చేసుకున్న సీట్లలో కూర్చోమని నిరాకరించినందుకు ఎయిర్ కెనడా ఇద్దరు మహిళా ప్రయాణికులను విమానం నుంచి దించేసింది. 

two female passengers off flight for not sitting in vomited seats Air Canada - bsb
Author
First Published Sep 7, 2023, 8:51 AM IST

కెనడా : ఎయిర్ కెనడా విమానంలో వాంతి చేసుకున్నసీట్లలో కూర్చోడానికి అభ్యంతరం చెప్పిన ఇద్దరు ప్రయాణీకులను కిందికి దింపేసింది. ఆ ఇద్దరు మహిళా ప్రయాణికులు మాంట్రియల్ మీదుగా వియన్నాకు వెళ్తున్నారు.

వారి తోటి ప్రయాణికుడు, సుసాన్ బెన్సన్ ఈ సంఘటనను ఫేస్‌బుక్ లో షేర్ చేయగా.. ఈ పోస్ట్‌ వైరల్ అయ్యింది. ఆగస్ట్ 26న లాస్ వెగాస్ నుంచి మాంట్రియల్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

అతను దీని గురించి రాస్తూ.... "మా సీట్లలో కొంచెం దుర్వాసన అనిపించింది. కానీ అదేంటో అర్థం కాలేదు. ఆ తరువాత తెలిసిందేమంటే.. అంతకుముందు ఫ్లైట్‌ జర్నీలో ఆ సీట్లలో కూర్చున్న వాళ్లెవరో వాంతులు చేసుకున్నారు. ఎయిర్ కెనడా ఆ ఫ్లైట్ అయిపోయిన తరువాత సరిగా క్లీన్ చేయలేదు. పూర్తిగా శుభ్రం చేయలేకపోయింది. దీంతో వాసన భరించలేకుండా ఉంది" అని చెప్పుకొచ్చారు. 

45 మందికి పైగా మహిళా టీచర్లపై అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్..

బెన్సన్ ప్రకారం, సీటు బెల్ట్, సీటు ఇప్పటికీ కనిపించే విధంగా తడిగా ఉన్నాయి. సీట్ల చుట్టూ వాంతి చేసుకున్న ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఎయిర్‌లైన్ సిబ్బంది పెర్ఫ్యూమ్, కాఫీ గ్రైండ్‌లను చల్లి ఆ వాసనను కప్పేయడానికి ప్రయత్నించింది, కానీ అది ఫలితం ఇవ్వలేదు.

సీటు పౌచ్‌లో కాఫీ గింజల పొడిని ఉంచారు. అయితే ఇవన్నీ వాసనను కప్పేయలేకపోయాయని ప్రయాణికులు విమాన సహాయకురాలికి వివరించడానికి ప్రయత్నించినప్పుడు, విమాన సహాయకురాలు క్షమాపణలు చెప్పింది. విమానం నిండిపోయిందని, వేరే సీటు ఇవ్వలేకపోతున్నామని వివరించింది.

ప్రయాణికులు సిబ్బందితో చాలాసేపు వాదించారు. విమానం పూర్తిగా నిండింది కాబట్టి.. ఆ సీట్లలోనే కూర్చోవాల్సి ఉంటుందని తెలిపారు. కొద్దిసేపటి తరువాత, ఒక పైలట్ ప్రయాణీకులతో మాట్లాడటానికి వచ్చారు. వారిద్దరి దగ్గరికి వచ్చి "వారిద్దరూ విమానం నుంచి వారి ఇష్టపూర్వకంగానే వెళ్లిపోవచ్చు. లేదా వారిద్దరినీ విమానం నుంచి దించేస్తామని.. నో ఫ్లై లిస్టులో పెడతామని’ తెలిపారు. 

ప్రయాణీకులు విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారని పైలట్ చెప్పాడు. అయితే, తోటి ప్రయాణికులు దీనిని అంగీకరించలేదు. వారు తమ హక్కు కోసం మాట్లాడారు, దురుసుగా లేరు. ఐదు గంటల ప్రయాణం అలా వాంతిలో కూర్చోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎయిర్ కెనడా ఇలాంటి చర్యలతో దారుణంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. 

దీనిమీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.. "నేను కెనడియన్‌గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఎయిర్ కెనడాను చూసి సిగ్గుపడుతున్నాను" అని ఒకరు పోస్ట్ చేశారు. ఎయిర్ కెనడా కస్టమర్‌లకు క్షమాపణ చెప్పింది, "వారు స్పష్టంగా వారికి అర్హత ఉన్న సంరక్షణ ప్రమాణాన్ని అందుకోలేదు" "మేము ఈ తీవ్రమైన విషయాన్ని అంతర్గతంగా సమీక్షిస్తున్నాం. ఈ సందర్భంలో మా ఆపరేటింగ్ విధానాలు సరిగ్గా అనుసరించనందున నేరుగా కస్టమర్‌లను అనుసరించాం" అని ప్రకటన కొనసాగింది.

"ఈ విషయం గురించి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం" అని ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ ఏడాది జులైలో ఇలాంటి ఘటనే జరిగింది, ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు రక్తంతో తడిసిన కార్పెట్‌ను చూసి భయాందోళనకు గురయ్యాడు.

పారిస్ నుండి టొరంటోకు వెడుతున్న విమానంలో జరిగిన బాధాకరమైన సంఘటన గురించి హబీబ్ బట్టా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios