45 మందికి పైగా మహిళా టీచర్లపై అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్..
పాకిస్థాన్‌లోని కరాచీలో 45 మందికి పైగా మహిళా టీచర్లపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసినందుకు ఓ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యారు.

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ తన సహోద్యోగులైన 45 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కీచక పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని ఇర్ఫాన్ గఫూర్ మెమన్‌గా గుర్తించారు. అతడి మొబైల్ ఫోన్ నుండి చాలా మంది మహిళల వీడియోలు, ఫోటోలు కూడా స్వాధీనం చేసుకున్నారు
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ..తన నివేదికలో అత్యాచారం తర్వాత బాధితులందరినీ బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. నిందితుడు ప్రిన్సిపాల్ మొబైల్ ఫోన్ నుండి పోలీసు బృందం సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు , ఈ కేసులో అతని విచారణ కొనసాగుతోందని దర్యాప్తు పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఫొటోలు వైరల్
మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల కొంతమంది మహిళల అభ్యంతరకరమైన చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ చిత్రాలతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ , మహిళా ఉపాధ్యాయుల మధ్య అసభ్యకరమైన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. కరాచీలోని ఓ పాఠశాలకు సంబంధమున్నట్టు తేలింది. వైరల్ చిత్రాలలో ఉన్న మహిళలందరూ ఈ కరాచీలోని పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విచారణలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతడ్ని విచారించడంతో అన్ని రహస్యాలను వెల్లడించాడు.
బాధితులంతా పాఠశాల ఉపాధ్యాయులే
ఆ పాఠశాలలో ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని, వారు వేర్వేరు సమయాల్లో పనిచేస్తున్నారని విచారణలో పోలీసులు కనుగొన్నారు. దీంతోపాటు పాఠశాలలో ఐదుగురు పురుష ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. పాఠశాలలో దాడి సందర్భంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అందులో పలు అభ్యంతరకర వీడియోలు లభ్యమయ్యాయి. ప్రిన్సిపాల్ కార్యాలయానికి సీల్ వేసి ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తామని విచారణ అధికారులు తెలిపారు. దీంతో పాటు నిందితుడు ప్రిన్సిపాల్‌ను ఏడు రోజుల రిమాండ్‌పై జైలుకు పంపారు. బాధితులంతా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో ఒక మహిళా టీచర్ ఇంటర్నెట్‌లో వీడియోలను అప్‌లోడ్ చేసి, ఆమె ఈ నేరానికి పాల్పడిందని నిందితుడు చెప్పాడు. అయితే నిందితురాలైన మహిళా టీచర్‌ను ఇంకా అరెస్టు చేయలేదు. ప్రిన్సిపాల్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులపై అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపు వంటి సెక్షన్లు నమోదు చేశారు.
విద్యాశాఖ మంత్రి చర్యలు
సింధ్ విద్యాశాఖ మంత్రి రానా హుస్సేన్ ఆదేశాల మేరకు, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ సింధ్ ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ డైరెక్టర్ కుర్బన్ అలీ భుట్టో, అసిస్టెంట్ డైరెక్టర్లు జావేద్ అక్తర్ , ముంతాజ్ హుస్సేన్ కంబారాణి ఉన్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు బయటపడతారని, వీరి వద్ద బాధిత మహిళల వీడియోలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) మలిర్ హసన్ సర్దార్ మాట్లాడుతూ మెమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటివరకు ఐదుగురికి పైగా మహిళలు ముందుకు వచ్చారు. బాధితుల నుంచి కూడా అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.